శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 30 నవంబరు 2020 (21:40 IST)

జగన్ వీరాభిమాని.. టిడిపి కార్యకర్తను పొడిచి చంపేశాడు

ఎన్నికలు ముగిసి సంవత్సరంపైగా దాటుతోంది. అయితే రాజకీయ కక్షలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న వైసిపి పార్టీలోని కొంతమంది టిడిపి కార్యకర్తలపై పగ తీర్చుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో ఒక టిడిపి కార్యకర్త భరత్ యాదవ్‌ను పొడిచి చంపేశాడు వైసిపి కార్యకర్త.
 
లక్ష్మీపురం సర్కిల్లో నివాసముండే భరత్ యాదవ్ ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీకి వెళ్ళబోతున్నాడు. టిడిపిలో ఎప్పుడూ చురుగ్గా ఉండేవాడు. ఒక కార్యకర్తగా పనిచేసేవాడు భరత్. అయితే గత ఎన్నికల్లో భరత్ టిడిపికి మద్ధతుగా పనిచేశాడని కొంతమంది వైసిపి కార్యకర్తలు అతనిపై కక్ష పెంచుకున్నారు.
 
నిన్న రాత్రి చిన్న తగాదాను పెద్దదిగా మారింది. దాంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దారితీసింది. అయితే శంకర్ తన దగ్గర ఉన్న కత్తితో భరత్ యాదవ్‌ను పొడిచేశాడు. అపస్మారక స్థితిలో భరత్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందాడు భరత్.
 
దీంతో ఒక్కసారిగా టిడిపి నాయకులు రుయా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలన్న డిమాండ్ చేశారు. భరత్ మృతితో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.