గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: గురువారం, 27 జూన్ 2019 (17:54 IST)

సీఎం జగన్ ప్లీజ్.. ప్లీజ్ అని బ్రతిమాలినా ప్రత్యేక హోదా రాదు... పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ భాజపా నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఎన్నిసార్లు ప్లీజ్.. ప్లీజ్ అని అడిగినా ఏపీకి ప్రత్యేక హోదా రానేరాదని తేల్చి చెప్పారు. అది ముగిసిపోయిన అధ్యాయమన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా వుందని ఆమె పేర్కొన్నారు.
 
తెలుగుదేశం పార్టీ నుంచి భాజపాలోకి వలసలు ఆగవన్నారు. తామేమీ తెదేపా నాయకులను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం లేదని చెప్పిన ఆమె, తెదేపాను భూస్థాపితం చేయాలని తాము అనుకోవడంలేదన్నారు. ఐతే గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అవినీతి విచ్చలవిడిగా జరిగిందని ఆమె ఆరోపించారు. 
 
ప్రజావేదిక కూలగొట్టడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తెదేపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే... అదే రీతిలో జగన్ ప్రభుత్వం కూడా చేసిందని విమర్శించారు. ఆ కట్టడాన్ని ప్రజల అవసరాలకి ఉపయోగిస్తే బావుండేదని అన్నారు.