బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (16:22 IST)

పీఆర్సీపై ఏం చేద్దాం : ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ రివ్యూ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారు. ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశాన్ని ఏం చేద్ధామంటూ ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా, ఇప్పటికే పీఆర్సీపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం అధికారులతో చర్చించారు. 
 
ముఖ్యంగా కమిటీ ఇచ్చిన సిఫార్సులను  పరిశీలించి ఎంత మేరకు వేతనాలు పెంచాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, సీపీఎస్ రద్దు, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను పర్మినెట్ చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను సైతం పరిష్కరిస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే విషయంపై ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.