బ్రహ్మోత్సవాలు, జగన్ తిరుమల పర్యటన ఇలా...
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని, పద్మావతి అతిథి గృహంలో సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 5.27 నిముషాలుకు అన్నమయ్య భవన్ నుంచి అధికారులతో వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొంటారు.
సాయంత్రం 6.15 నిముషాలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఉరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకోని పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రాత్రి 7.40 నిముషాలకు శ్రీవారి గరుడ వాహన దర్శనం చేసుకుని తిరిగి పద్మావతి పద్మావతి గృహానికి చేరుకుంటారు. రాత్రి చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు జగన్ కలుస్తారని సమాచారం.
24వ తేది ఉదయం 6.15 నిమిషాలకు మరోసారి శ్రీవారిని దర్శించుకుని, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నాదనీరాజనం మండపంలో సుందరకాండ పఠనంలో పాల్గొంటారు. అక్కడ నుంచి 8.10 నిమిషాలకు కర్నాటక చౌల్ట్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 9.20 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరుతారు.