మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (15:34 IST)

కరోనా భయం లేదు... పుర పోరు నిర్వహించండి.. ఎస్ఈసీకి సీఎస్ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. పైగా, ఎన్నికలు 6 వారాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నాద్ధంగా ఉన్నామని ఆ లేఖలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితాలు ముద్రణ పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రజారోగ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రభుత్వంతో ఎస్ఈసీ సంప్రదింపులు జరిపురంటే కరోనాపై వాస్తవ నివేదికను అందించేవాళ్ళని పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తి నియంత్రణ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వైద్య శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన నివేదికను కూడా పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. విదేశాల నుండి వచ్చిన ప్రతి ప్రయాణికుడి స్క్రీంనింగ్ చేసి, ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాల కీలక పాత్ర పోషిస్తాయిని తెలిపారు. కరోన నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి వెల్లడించారు. 
 
మరో 3, 4 వారాల్లో కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల సీఎస్ నీలం సాహి రాసిన లేఖలో పేర్కొన్నారు.