శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 28 డిశెంబరు 2020 (15:58 IST)

సీఎం జగన్ ప్రజలను, పార్టీలను దోచుకున్నాడు: మళ్లీ నోరు జారిన నారాయణ

పేరుకే  ఆయన డిప్యూటీ సీఎం. ఆయన మాట్లాడే మాటలు ప్రజలకే కాదు ఆయనకే అర్థం కాదు. గతంలో అడ్డదిడ్డంగా మాట్లాడే పలుమార్లు విమర్శల పాలైన ఆయన మాట తీరు మాత్రం మార్చుకోలేదు. తడబాటుతో మాట్లాడుతారో లేకుంటే పొరపాటునే మాట్లాడుతారో ఏమో గానీ సొంత పార్టీలోనే మాట పడాల్సి వస్తోంది. మరోసారి తన అడ్డదిడ్డమైన మాటలతో నోరు పారేసుకున్నారు ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి. 
 
గుడ్ ఫ్రైడేని ముస్లింల పండుగగా అభివర్ణించిన మంత్రి తన అవివేకాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షాలు ఇళ్ల పట్టాలపై కుక్కల్లా మొరుగుతున్నాయని అని విమర్శించి ఊరుకోకుండా.. ప్రజలు మాత్రం కుక్కల్లా మొరగడం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జగన్ ప్రజలను, పార్టీల మనసును దోచుకున్నాడనబోయి ప్రజలను, పార్టీలను దోచుకున్నాడంటూ నోరు జారారు. దీంతో అక్కడున్న అందరూ అవాక్కయ్యారు.