పోలీసులపై దాడి చేస్తే చర్యలు తప్పవు.. ఏపీ డీజీపీ వార్నింగ్
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే... శాంతిభద్రతలను దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేసినా, పోలీసులపై దాడి చేసినా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. పుంగనూరులో పోలీసులపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
పుంగనూరు దాడి ఘటనలో పాల్గొంది బయటి వ్యక్తులా.. స్థానికులా..? అనేదానిపై నిశితంగా విచారణ జరుపుతున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 80 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.