గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి
కరీంనగర్‌లోని గంగాధరలో ఇంటర్ విద్యార్థిని ప్రదీప్తి గుండెపోటుతో మృతి చెందింది. కాలేజీలో ఫ్రెషర్స్ డే ప్రోగ్రాంలో డాన్స్ చేస్తున్న సమయంలో ఒకసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన తోటివారు ఆసుపత్రికి తరలించారు.
కానీ మార్గమధ్యంలోనే ప్రదీప్తి మృతి చెందింది. ఆమె పడిపోవడం చూసిన స్నేహితులు కళాశాల లెక్చరర్లు సిపిఆర్ చేసి రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది.
ప్రదీప్తి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నేలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుకుంటోంది. వెంకటాయపల్లి వీరి స్వస్థలం. తల్లిదండ్రులు శారద, అంజయ్యలు. ఆమె ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.