గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జులై 2023 (12:33 IST)

గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడి మృతి

gudem mahipal reddy
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటూ వచ్చారు. దీంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడు పేరు విష్ణువర్థన్ రెడ్డి. వయసు 30 యేళ్లు. 
 
కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడు మృతితో మహిపాల్ రెడ్డి కుటుంబ విషాదంలో మునిగిపోయింది. విష్ణువర్థన్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం ఇంటికి తరలించారు. ఆయన అంత్యక్రియలు మరికాసేపట్లో అంత్యక్రియలు జరుగుతున్నాయి.