బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (15:36 IST)

పట్టాభి అన్న‌ది చిన్న‌మాట కాదు... ద‌ర్యాప్తులో అన్నీ తేలుస్తాం

గుజరాత్ లో దొరికిన డ్రగ్స్ కి ఏపితో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పారు. గతంలో ఇదే విషయమై ఎన్నిసార్లు చెప్పినా కావాలని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో  ఉన్న వ్యక్తిపై దుర్భాషలు అడటం సరికాదని అన్నారు. టిడిపి నేత పట్టాభి నిన్నమాట్లాడిన భాష సరైంది కాదనీ, గతంలో ఆ బాష తాను ఎప్పుడూ వినలేదన్నారు. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని అలా మాట్లాడటం సరికాదన్నారు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. 
 
గత కొద్ది రోజులుగా ఆయ‌న చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని, దీని వెనుక ఎవరి కుట్ర ఉన్నాదర్యాప్తులో బహిర్గతం చేస్తామని వెల్లడించారు. అలాగే దాడులు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలి అని డిజిపి చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సమస్య అనేది ఇప్పటిది కాదని, దశాబ్దాలుగా ఉందని అన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుతామని, దీనిలో భాగంగా ఈ ఏడాది కుడా రాష్ట్రంలో కరోనా కారణంగా 206 మంది పోలీసులు మృతి చెందారు అని డీజీపీ అన్నారు.