శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (11:42 IST)

మంత్రి పుష్ప శ్రీవాణిపై కులవివాదం

ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిని మరోసారి కులవివాదం చుట్టుముట్టింది. ఆమె ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్‌, అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్‌ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో జన్మించిన పుష్ప శ్రీవాణి గిరిజన వ్యక్తి కాదని.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమెది కొండదేవర తెగ కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ జిల్లా పరిశీలన కమిటీ విచారణకు కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం.
 
మరోవైపు ఈ వివాదంపై పుష్పశ్రీవాణి స్పందించారు. 2008 నుంచే ఈ వివాదం ఉందని.. 2014లోనూ తెదేపా ఇదే విధంగా ఫిర్యాదు చేసిందన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తులే ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. ప్రతిసారి ఈ కేసు కోర్టుల్లో వీగిపోయిందని.. ఈ దఫా కూడా న్యాయమే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.