గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (16:12 IST)

అంబానీ పెళ్లిలో కూడా 100 స్ట్రైక్ రేట్ గురించే ఆసక్తికర చర్చ : పవన్ కళ్యాణ్ (Video)

pawan kalyan
భారతదేశ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ - నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ వివాహంలో కూడా తనను కలిసి ప్రతి ఒక్కరూ వంద శాంత స్ట్రైక్ రేట్ ఎలా సాధించారంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా అడిగారని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు. కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వాని బుద్ధి చెప్పారని అన్నారు. తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని, కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలిపారు.
 
ఇక, తాను ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో ఉన్నానని, ప్రత్యేకంగా ఆయన పక్కన నిల్చుని ఫొటో తీయించుకోవాలని కోరుకోనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎక్కడైనా మోడీని కలిస్తే 60 సెకన్ల కంటే ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడనని, ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని, అలాంటి వ్యక్తి సమయం వృథా చేయరాదని భావిస్తానని వెల్లడించారు. 
 
తన స్వార్థానికి తాను ఏమీ అడగనని, ఇప్పటివరకు ప్రధానిని ఏమీ అడగలేదని, కానీ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఇక అడుగుతానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, విశాఖ రైల్వే జోన్ కావాలని, 20 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతానని పవన్ వివరించారు. జననసే పార్టీలో చాలామంది పదవులు అడుగుతున్నారని, ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవినే 50 మంది అడిగారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.