గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (14:52 IST)

టీవీ చానెల్ పెడుతున్నా.. జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదు : విజయసాయి రెడ్డి

vijayasaireddy
వైకాపా సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఓ టీవీ చానెల్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినా తాను వినబోనని, టీవీ చానెల్ పెట్టి తీరుతానని ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను టీవీ చానెల్ పెడతానని చెబితే తమ పార్టీ అధినేత జగన్ వద్దని వారించారన్నారు. కానీ ఈ దఫా మాత్రం పెట్టి తీరుతానని చెప్పారు. ఈ విషయంలో జగన్ చెప్పినా వినే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
జగన్ చెప్పినా.. మరెవరు చెప్పినా వినని, చానెల్ పెట్టి తీరుతానని తెలిపారు. తన చానల్ కుల, మతాలకు అతీతంగదా నిజాయితీగా పని చేస్తుందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో తన చానల్ పని చేస్తుందని తెలిపారు. తన చానల్ తటస్థంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు.