గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 జులై 2024 (14:45 IST)

వంశీ, వెంకట కృష్ణలు, టీవీ 5 సాంబుడు.. వీళ్ళ పుట్టుక మీద నాకు అనుమానాలున్నాయ్! (video)

vijayasai reddy
vijayasai reddy
వైకాపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఒక మహిళా అధికారితో అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై బాధితురాలు ప్రెస్ మీట్ పెట్టి తనపై వస్తోన్న వార్తల్ని కొట్టిపారేసింది. 
 
తాజాగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని... ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వ రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
 
తన ఇంటికి ఒక టీడీపీ నాయకుడు, ఒక మహిళ వచ్చారని... విజయసాయిరెడ్డిగాడు పారిపోయాడా? ఉన్నాడా? అని అడిగాడని... సీసీ కెమెరాల్లో ఇది రికార్డ్ అయిందని విజయసాయి తెలిపారు. వాడు టైమ్ చెపితే తానే వాడి ఇంటికి వెళ్తానని అన్నారు. 
 
తాము ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, తోక ఆడించే వారి తోకలను తాము అధికారంలోకి వచ్చాక కట్ చేస్తామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాము తగ్గేదే లేదని చెప్పారు.
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై వరుసక్రమంలో బురద చల్లుతున్నారని విజయసాయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు సంబంధం అంటకట్టేస్తారా? అంటూ మండిపడ్డారు. 
 
తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రామోజీరావునే తాను ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పారు. పరువునష్టం దావాతో పాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని... ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతానని హెచ్చరించారు. 
 
త్వరలో తన స్వంత మీడియా ఛానెల్‌ని ప్రారంభించే ప్రణాళికలను విజయసాయి రెడ్డి తెలిపారు. "నేను జగన్‌ను కూడా పట్టించుకోను. నేను నా ఛానెల్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు పనికిరాని వంశీ గాడే ఛానల్ పెట్టాడు.. త్వరలో నేను న్యూస్ ఛానల్ పెడుతున్న.. కుల పత్రికలు, కుల ఛానల్స్ ను ఎండ కడతా" అంటూ చెప్పారు. అలాగే తమ పార్టీలో అంతర్గత వ్యవహారాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
 
ఈ ఆరోపణల వెనుక కమ్మ సామాజికవర్గం ఉందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
 
 మీడియా సంస్థలు వాస్తవాలను వక్రీకరించడం, తన ప్రతిష్టను దిగజార్చడం, మహిళ పాత్రను దెబ్బతీయడాన్ని ఆయన ఖండించారు.
 
"నాపై అవాస్తవమైన ఆరోపణలు చేసిన టీవీ 5 సాంబశివరావు, మహా న్యూస్ వంశీ, ఆంధ్రజ్యోతి అందరి మీద చట్ట పరమైన చర్యలు తీసుకుంటా.. దీనికి కారణమైన ఏ ఒక్కడినీ వదిలే ప్రసక్తే లేదు. ఏబీఎన్, టీవీ5, మహాన్యూస్ చేసిన ఆరోపణలకు మీతోనే క్షమాపణ చెప్పిస్తా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
అలాగే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. రిపోర్టర్లు కూడా పదే పదే తనను కలిస్తే.. వారితో కూడా గే సంబంధం అంటగట్టేస్తారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. "ఒరేయ్ వంశీ కృష్ణ మీ అమ్మని, అక్కని ఇలానే అంటే గమ్మున ఉంటావా.. వంశీ కృష్ణ వెంకట కృష్ణ, టీవీ 5 సాంబుడు వీళ్ళ పుట్టుక మీద నాకు అనుమానాలు ఉన్నాయి.. ముందు మీ అమ్మానాన్నలను డీఎన్ఏ చేసుకోమనాలి" అంటూ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.