ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (18:44 IST)

అశ్విన్ బాబు, దిగంగనా ల శివం భజే డేట్ ఫిక్స్

Ashwin Babu
Ashwin Babu
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనున్నట్టు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ఈ రోజు తెలిపారు.
 
అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరో - హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ నటించారు. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, "వైవిధ్యమైన కథతో, సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో ఆగష్టు 1న విడుదలవ్వనున్న చిత్రం 'శివం భజే'. ఫస్ట్ లుక్ కి, టీజర్ కి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర విజయంపై మాకున్న విశ్వాసం మరింత పెరిగింది. మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్, అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, ఇండస్ట్రీ మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో మా మొదటి చిత్రం అనుకున్నట్టుగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కర్యక్రమాలు చివరి దశలో ఉండగా ఆగష్టు 1న ప్రపంచవ్యప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ మరియు పాటల విడుదల గురించి వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు.