శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (23:40 IST)

ఆయనకు 68.. నాకు 35.. గర్భం ఎలా సాధ్యం? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి సాయిరెడ్డా? శాంతి Video

shanthi
తాను విదేశాల్లో ఉండగా తన భార్య, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భవతి అయిందని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె భర్త మదన్ మోహన్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పైగా, తన భార్య గర్భానికి వైకాపా మాజీ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వై.విజయసాయి రెడ్డి కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రసవత్తర చర్చ సాగుంతుంది. పైగా, ఈ అంశం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో, శాంతి మీడియా ముందుకు వచ్చారు. 2013లో తనకు మదన్ మోహన్‌తో వివాహం జరిగిందన్నారు. న్యాయ విద్యను చదువుతుండగానే తమ ఇద్దరికీ పెళ్లయిందని తెలిపారు. కానీ పెళ్లయ్యాక మదన్ మోహన్ తనను చాలా హింసించాడని శాంతి ఆరోపించారు. దాంతో 2016లో ఇద్దరం విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. పిల్లలు, బంగారం, కారు విషయంలో పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కూడా రాసుకున్నామన్నారు. మదన్ మోహన్‌తో విడాకుల తర్వాత తాను సుభాష్ అనే వ్యక్తిని పెళ్లదానని శాంతి వెల్లడించారు.
shanthi
 
2021 వరకు తాను విశాఖలోనే ఉండేదాన్నని పేర్కొన్నారు. తాను మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ, మదన్ తనను వేధిస్తుండేవాడని ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చాక పిల్లలను మదన్‌కు చూపించానని తెలిపారు. డబ్బు కోసమే అతడు ఇలాంటి అనుమానాలు సృష్టించేలా ఆరోపణలు చేస్తున్నాడని వివరించారు. "నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. అదే వేరే కులానికి చెందిన దాన్నయితే ఇలా అనగలరా? ఒక ట్రైబల్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు ధరించకూడదా? నేను కష్టపడి న్యాయవాద విద్యను చదివాను, అడ్వొకేట్‌గా ప్రాక్టీసు చేశాను. ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం నాకు లేదు.
 
ఇక సాయిరెడ్డి గురించి చెప్పాల్సి వస్తే... ఆయనొక గౌరవనీయ వ్యక్తి. నేను విజయసాయిరెడ్డిని తొలిసారి విశాఖలోనే చూశాను. మాది నంద్యాల. రాయలసీమలో నాకు ఒక్క సర్పంచి కూడా తెలియదు. సీమలో ఆడపిల్లలు బయట ఊర్లు తిరిగేది ఉండదు. అలాంటిది ఒక ఎంపీ పరిచయం అయ్యే సరికి, అబ్బ... ఇలా ఉంటుంది అనిపించింది. దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనే సంస్థ ఉంది. దీని వ్యవహారాలు చూసుకోవాల్సింది అసిస్టెంట్ కమిషనర్.
shanthi
 
ఆ ప్రేమ సమాజం సంస్థకు విశాఖ బీచ్ రోడ్‌లో 30 ఎకరాల భూమి ఉంది. అందులో సాయి ప్రియా రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్లు ఆ 30 ఎకరాల భూమికి చాలా తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు. సాయిరెడ్డి ద్వారా ఆ విషయం నా దృష్టికి వచ్చింది. దాంతో నేను ఆ స్థలంలో తనిఖీలకు వెళ్లాను. అక్కడి నిర్వాహకులతో మాట్లాడాను. లీజును పెంచడం ద్వారా ప్రేమ సమాజం సంస్థకు మేలు చేసే ప్రయత్నం చేశాను. ఇదీ... విజయసాయి రెడ్డితో నాకున్న పరిచయం" అంటూ శాంతి కన్నీటిపర్యంతమయ్యారు.