ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జూన్ 2024 (12:26 IST)

రాజీనామా చేసిన జగన్ వీరవిధేయుడు కరికాల వలవన్

valavan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ రాజీనామా చేశారు. ఆయనను ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో మరో నెలన్నర పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. జగన్‌ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించారని వలవన్‌పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను కొత్త ప్రభుత్వం తొలగించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వలవన్ రాజీనామా చేశారు. 
 
ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన అధికారులు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో కరికాల వలవన్ ఒకరు. నిజానికి ఆయన పదవీకాలం గతంలోనే ముగిసింది. కానీ, ఉద్యోగ విరమణ తర్వాత కూడా గత ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారులను కొనసాగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేస్తూ వచ్చింది. 
 
అలాంటి వారిలో ఈయన ఒకరు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వలవన్ మరో నెల రోజుల పాటు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకి రావడంతో వలవన్ రాజీనామా చేశారు. తన పదవీకాలం పొడగించిన జగన్ ప్రభుత్వానికి వలవన్ పూర్తి స్థాయిలో సహకరించారని, జగన్‌కు అనుకూలంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు.