శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (09:20 IST)

విభిన్నపాత్రల్లో మెప్పించిన నటుడు కృష్ణంరాజు : చంద్రబాబు సంతాపం

chandrababu
సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. 
 
ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు " అని ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తన సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. "ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.