గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (16:40 IST)

తన చెప్పుతో తానే కొట్టుకున్న మాజీమంత్రి కొత్తపల్లి

ప్రస్తుతం వైకాపాలో సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ శాఖామంత్రిగా పని చేసిన టీడీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ సంఘటన కలకలం రేపింది. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఆ తర్వాత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు. 
 
ఆ సమయంలో ఆయన తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రాయచిత్తంగా ఈ పని చేసినట్టు చెప్పారు.