శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 26 డిశెంబరు 2017 (19:12 IST)

ఏపీ లోగిళ్లన్నీ నెట్టిళ్లే.... తక్కువ ధరకే అంతర్జాలం, టీవీ, టెలిఫోన్ సదుపాయం

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ పథకంలో భాగంగా బుధవారం మరో కీలక ఘట్టం ఆవిష్కరణ కాబోతోంది. 1.10 లక్షల కుటుంబాలకు ఇప్పటికే ఇచ్చిన ఫైబర్నెట్ కనెక్షన్లను రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. రాష్

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ పథకంలో భాగంగా బుధవారం మరో కీలక ఘట్టం ఆవిష్కరణ కాబోతోంది. 1.10 లక్షల కుటుంబాలకు ఇప్పటికే ఇచ్చిన ఫైబర్నెట్ కనెక్షన్లను రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, 250 టెలీవిజన్ ఛానెళ్లను అందించాలనే సంకల్పంలో ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థ రాష్ట్ర వ్యాప్యంగా 1.40 లక్షల ఆవాసాలను పైబర్ నెట్‌తో అనుసంధానించనుంది. తొలిదశలో 1.10 లక్షల ఆవాసాలకు ఈ సదుపాయం కల్పించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా దీన్ని ఘనంగా ప్రారంభించబోతోంది. ఇందుకోసం సచివాలయంలో ఏర్పాట్లు భారీఎత్తున చేశారు.  
 
ఎన్నో ప్రత్యేకతలు
ప్రభుత్వం అమలు చేస్తున్న ఫైబర్ నెట్ పథకం ఎంతో ప్రత్యేకతలను సంతరించుకుంది. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకం లేదు. కేవలం రూ.149 (జీఎస్టీ తదితర ఛార్జీలు అదనం)లకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఒక కనెక్షన్ మీద మూడు సేవలు అందించాలనేది సంకల్పం. ఇంత పెద్ద ప్రాజెక్టును మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించలేదు.   దేశంలో ఇప్పటివరకు భూగర్భంలో ఫైబర్ నెట్ కేబుల్ వ్యవస్థ ఉంటే ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కరెంటు స్తంభాలను ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో భూ ఉపరితలం మీద ఓఎఫ్సీ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
 
టెలిఫోన్, మొబైల్ సేవలు అందుబాటులో లేని మారుమూల గ్రమాలు రాష్ట్రంలో 3,060 వరకు ఉన్నాయి. వాటికి కూడా ఫైబర్ నెట్‌తో ఇప్పుడు అనుసంధానం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల కిలోమీటర్ల మేర ఈ తరహా కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల ద్వారా కనెక్షన్లు ఇవ్వనున్నారు. కనెక్షన్ల కోసం రెండు తరహా సెటాప్ బాక్సులు అవసరం. అవి జీపాన్, ఐపీటీవీ బాక్సులు. 
 
లైన్లు లేని చోట
కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఏమాత్రం అవకాశం లేని ఆవాసాలకు ఫ్రీ స్పేస్ ఆప్టిక్ కనెక్షన్ పరిజ్ఞానంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నారు. దీనిద్వారా 20 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కేబుళ్లు లేకుండా ఈ సదుపాయం కల్పించవచ్చు.  గూగుల్ ఎక్స్ సంస్థ దీనికి సహకారం అందిస్తోంది. 
 
వర్చువల్ తరగతి గదులు
ఫైబర్ నెట్ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ తరగతి గదులు కూడా నిర్వహిస్తున్నారు. తొలిదశలో 4 వేల పాఠాశాలల్లో వర్చువల్ తరగతి గదులు ఏర్పాటు చేశారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల సర్వైలెన్సు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తతం 5 వేల కెమెరాలున్నాయి. తరువాత దశల్లో దాన్ని పూర్తి చేస్తారు. రాష్ట్రంలోని పలుచోట్ల పబ్లిక్ వైఫై సదుపాయాన్ని కూడా ఫైబర్ నెట్ సంస్థ కల్పించనుంది.