సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 6 మే 2022 (18:58 IST)

వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోరేమిటి? పవన్ ప్రశ్న

pawan kalyan
ఏపీలో వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతుంటే, వాటిని నియంత్రించడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలను నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
మహిళలపై జరుగుతున్న దారుణాలను కట్టడి చేయడంలో పాలకులు విఫలమయ్యారనీ, అందువల్ల ఇకపై ఈ ఘటనలు జరగకుండే చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులే రంగంలోకి దిగాలని కోరారు.

 
ఈ దారుణ ఘటనలు ఏపీలో ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుని మహిళల రక్షణకై ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వాన్ని తాము నిందించడం లేదనీ, సూచన మాత్రమే చేస్తున్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు.