గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (09:30 IST)

ఏపీ: ఉద్యోగుల బదిలీ గడువు నెలాఖరు వరకు పొడిగింపు

ys jagan
ఏపీలో ఉద్యోగుల బదిలీలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీ గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ పెంచింది. ముందు ఈ నెల 17వ తేదీ వరకే బదిలీలపై ప్రభుత్వం నిషేదం ఎత్తివేసింది.
 
అయితే కొన్ని శాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఉద్యోగుల బదిలీల గడువు పెంచాలని సీఎం జగన్‌కు పలు ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల గడువును నెలాఖరు వరకూ పెంచుతూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఏపిలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకూ పది రోజులు మాత్రమే బదిలీలపై నిషేదం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.