శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: బుధవారం, 26 జూన్ 2019 (13:49 IST)

ఒంగోలు అత్యాచార బాధితురాలికి మంత్రి సుచరిత రూ. 10 లక్షలు...

ప్రకాశం జిల్లా ఒంగోలులో సామూహిక అత్యాచారానికి గురైన బాలికను రాష్ట్ర హోంమంత్రి సుచరిత పరామర్శించారు. స్థానిక బాలనగర్ లోని బాలసదన్‌లో ఆశ్రయం పొందుతున్న బాలికతో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రికి వివరించారు. 
 
బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు సుచరిత.  దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మహిళలు, బాలల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి వుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.