సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (11:41 IST)

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఆయన సొంతిల్లు కాదు : మంత్రి బొత్స

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇల్లు ఉంది. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఆయన సొంత నివాసం కాదన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటిని తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకే తొలుత ప్రజా వేదికను కూల్చివేసినట్టు చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాలని ఆయన అన్నారు. 
 
పైగా, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఆయన సొంతిల్లేమి కాదన్నారు. ఆయన అనుచరుడినో.. తాబేదారునో పెట్టుకుని అదంతా ఆక్రమించుకున్నారన్నారు. ఈ విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా ఉంటే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. సీఆర్డీయేలో చాలా అవినీతి జరిగిందన్నారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం రూ.400 కోట్లతో ప్రారంభించి చివరకు రూ.700 కోట్లకు పెంచేశారని విమర్శించారు.