ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (13:58 IST)

ఏపీ మంత్రి అమరనాథరెడ్డిని ఆ అవ్వ చేయి పట్టుకుని లాక్కెళ్లి..?

చిత్తూరు జిల్లా పెదపంజాణి మండలం చాపనేరులో పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రి అమరనాథరెడ్డిని ఓ అవ్వే చేతిని బట్టుకుని తన గుడిసెలోకి లాక్కెళ్లింది. ఎందుకంటే...? ఎందరు అధికారులతో మొరపెట్టుకున్నా తన సమస్య తీరలేద

చిత్తూరు జిల్లా పెదపంజాణి మండలం చాపనేరులో పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రి అమరనాథరెడ్డిని ఓ అవ్వే చేతిని బట్టుకుని తన గుడిసెలోకి లాక్కెళ్లింది. ఎందుకంటే...? ఎందరు అధికారులతో మొరపెట్టుకున్నా తన సమస్య తీరలేదని.. అందుకే అమరనాథరెడ్డి చేతులు పట్టుకుని మరి తీసుకెళ్లి తన గుడిసెను చూపించింది. 
 
ఏపీ మంత్రి అమరనాథరెడ్డి తన గ్రామానికి వస్తున్నాడని తెలిసిన వేళ.. అవ్వ అతని వద్దకు వెళ్లింది. అధికారుల వైఖరితో విసుగు చెందిన ఆ అవ్వ.. మంత్రిన తన గుడిసె వద్దకు తీసుకెళ్లింది. తన భర్తకు ఫించన్ రావట్లేదని.. చలికి, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతూ గుడిసెలో ఉండలేకపోతున్నామని.. కనీసం రేకుల ఇళ్లైనా ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
 
దీనిపై స్పందించిన మంత్రి ఆమెకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని.. భార్యాభర్తలు ఇద్దరికీ ఫించన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.