మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 31 ఆగస్టు 2017 (18:55 IST)

నంద్యాల ప్రజలను అవమానిస్తున్నారు... జగన్ పైన మంత్రి జవహర్ ధ్వజం

అమరావతి: నంద్యాలలో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవమానపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్ జవహర్ అన్నారు. నంద్యాలలో ఓటమికి కారణాలను విశ్లేషించుకోకుండా గెలుపు విజయానికి తేడా ఏమిటో కూడా తెలియని స్థితిలో జగన్ మోహన్ రెడ్డి మాట్ల

అమరావతి: నంద్యాలలో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవమానపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్ జవహర్ అన్నారు. నంద్యాలలో ఓటమికి కారణాలను విశ్లేషించుకోకుండా గెలుపు విజయానికి తేడా ఏమిటో కూడా తెలియని స్థితిలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం సచివాలయంలో మంత్రి కె ఎస్ జవహర్ మాట్లాడుతూ విజయం, గెలుపు రెండింటికి ఒకటే అర్ధమనే విషయం తెలియని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడుగా ఉండటం బాధాకరమని అన్నారు.
 
ఇప్పటివరకు దళితులు, క్రిస్టియన్లు, ముస్లిం, మైనార్టీలు వైసీపీ వైపు ఉన్నారనే అభిప్రాయం ఉందన్నారు. అయితే, నంద్యాల ఉప ఎన్నికలో పోలింగ్ బూత్ వారీగా వచ్చని ఓట్లను విశ్లేషించినప్పుడు ఈ అభిప్రాయం తప్పు అని తేలిందన్నారు. దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, మైనార్టీలు ఉన్నచోట టీడీపీకి వచ్చిన ఓట్లు 11 శాతం పెరిగాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందని వారు గుర్తించారని ఆయన అన్నారు. ప్రజల మనసు తెలుసుకోకుండా ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ సలహాదారులను పెట్టుకుని అధికారంలోకి వచ్చేద్ధామనుకుంటే సాధ్యం కాదని మంత్రి జవహార్ అన్నారు. 
 
నిన్నటివరకు నోటికి వచ్చినట్లు మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొడాలి నాని, రోజాలతో మాట్లాడిస్తున్నారని ఆయన విమర్శించారు. నిజంగా కొడాలి నానికి దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి జవహార్ డిమాండ్ చేశారు. కొడాలి నాని రాజీనామా చేస్తే టీడీపీ నుంచి సాధారణ కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటామని ఆయన అన్నారు. నంద్యాలలో 15 రోజుల పాటు ప్రచారం చేసి ఓటమిని మూటగట్టుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఖతం అయ్యిందని అన్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి ఖతం చేశారని ఆయన అన్నారు. 
 
నంద్యాల ఓటమి తరవాత కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రాకపోవడంతో వైసీపీకి చెందిన 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. శుక్రవారం వెలువడనున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని జోస్యం చెప్పారు. వైసీపీ నుంచి గెలిచే నలుగురైదుగురు కూడా స్వంత ఇమేజ్‌తోనే గెలవనున్నారని అన్నారు. గణేష్ నిమిజ్జనంతో పాటు వైసీపీని కూడా ప్రజలు నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి జవహర్ చెప్పారు.