శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (18:27 IST)

మా ఎన్నికలకు మాకు ఎలాంటి సంబంధం లేదు : పేర్ని నాని

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికిగానీ ఎటువంటి సంబంధం లేదు అని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము ఏ వ్యక్తిని సమర్థించడం లేదన్నారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 10వ తేదీన మా ఎన్నికల కోసం ఓటింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు సారథ్యంలో ప్యానెల్స్ తలపడనున్నాయి. మా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటలు వదులుతున్నారు. 
 
ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదు.. అలాంటి వాడికి ఎలా ఓట్లు వేస్తారని విష్ణు ప్యానల్ సభ్యులు అంటుంటే.. నాకన్నా ఎక్కువ తెలుగు మాట్లాడేవాడు విష్ణు ప్యానల్‌లో ఉన్నారా.. అని ప్రకాష్ రాజ్ ప్రశ్నింస్తున్నాడు. 
 
అలాగే మా ఎన్నికల్లో జగన్‌, కేసీఆర్‌, బీజేపీనిలాగడం పట్ల కూడా ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మా కు రాజకీయ పార్టీలకు ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు