ఏపీ టూరిజం వైబ్ సైట్ ప్రారంభం
ఏపీ టూరిజం వెబ్ సైట్ ను పర్యాటక మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, ఆ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎండీ ప్రవీణ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు.
సచివాలయం లోని తన ఛాంబర్ లో పర్యాటకంతో పాటు, పలు శాఖల అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ వెబ్ సైట్లో ప్రజలకు, పర్యాటకుల సౌకర్యార్థం కావల్సిన సమాచారాన్ని పొందు పరచామని తెలిపారు.పర్యాటక శాఖ మరింత అభివృద్ది చెందేలా కృషి చేయాలని ప్రేత్యేక ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు.
24 పెద్ద పడవలకు షరతులు ఉన్నాయని.. వాటిలో కొన్ని అంశాలను మినహాయింపులు ఇవ్వాలని అధికారులను పోర్ట్ ప్రైవేట్ ఆపరేటర్లు కోరారు.
పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రల్ల్లో ని నియమ నిబంధనలను పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికలవలయన్ పొర్ట్ అథారిటికి సూచించారు.
బోటు ప్రమాదాలను నివారించేందుకు 9 నియంత్రణ గదులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని.. సీఈఓ ప్రవీణ్ తెలిపారు. ఈవారం నుంచి చిన్న పడవలు పనిచేస్తాయని..11 పడవలకు డ్రై డాకింగ్ పూర్తి అయినట్లు పర్యాటక శాఖ సీఈఓ చెప్పారు.
ఈ సమావేశంలో , ప్రేత్యేక ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ప్రేత్యేక ముఖ్య కార్యదర్శి కరికాలవలయన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుసూధన్, డైరెక్టర్లు సాంభశివ రాజు, పి శ్రీనివాసరావు, టెక్నాలజీ ఆఫీసర్ రవికిరణ్ లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.