శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (16:13 IST)

తెల్లవారుజాము నుంచే వృద్దాప్య పెన్షన్ డబ్బుల పంపిణీ

pension
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లను బుధవారం తెల్లవారుజామునుంచే గ్రామాల్లోని వలంటీర్లు పంపిణీ మొదలుపెట్టారు. ఫలితంగా తొలి రెండు గంటల్లోనే ఏకంగా 50 శాతం పింఛన్ల డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేశారు. 
 
రాష్ట్రంలో దాదాపుగా 60.75 లక్షల పెన్షనర్లకు రూ.1,543.80 కోట్ల నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ డబ్బుల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే ప్రారంభించారు. 
 
ఫలితంగా ఉదయం 7 గంటలకే దాదాపు 30.01 శాతం పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే, ఉదయం 8 గంటలకు 48.27 శాతం మందికి పంపిణీ చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ముత్యాల నాయుడు తెలిపారు.