సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (11:19 IST)

దేశంలోనే తొలిసారి.. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఈ- పోస్ యంత్రాల వినియోగం

apsrtc
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఈ-పోస్ యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. ఈ తరహా యంత్రాలను ఉపయోగించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. వీటి వినియోగానికి పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ, గుంటూరు-2 డిపోలను ఎంచుకున్నారు. 
 
ఈ డిపోల నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, బెంగుళూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే గత మూడు రోజులుగా వీటిని వినియోగిస్తున్నారు. ప్రయాణికులతో పాటు ఆస్టీసీ సిబ్బంది నుంచి వచ్చే స్పందన ఆధారంగా వీటిని మరిన్ని బస్సుల్లో వినియోగించే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారు. అదేసమయంలో ఈ మిషన్ల వినియోగంపై కండక్టర్లు, డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. 
 
ఈ మిషన్ల ద్వారా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు అంటే ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా టిక్కెట్ ధర చెల్లించుకోవచ్చు. అదేసమయంలో నగదు చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ మిషన్లను వినియోగించడం ద్వారా చిల్లర సమస్యకు ఫుల్‌స్టాఫ్ పడుతుందని భావిస్తున్నారు.