గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (12:41 IST)

పంచాయతీ ఎన్నికలు ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? : పవన్ కు మంత్రుల సూటి ప్రశ్న

పంచాయతీ ఎన్నికలు ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను రాష్ట్ర మంత్రులు మేకపాటి, అనిల్ ప్రశ్నించారు. వారు సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ...
 
"ప్రజారోగ్యంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే , ప్రజల ఆరోగ్య గురించి పట్టించుకునే వారైతే ఈ పని చేయండి, నిన్న దివీస్ పర్యటనలో అవగాహనలేని మాటలు మాట్లాడారు. నిజానికి మా ప్రభుత్వం రాగానే అంటే జులై, 19, 2019లో  75 శాతం స్థానికులకు ఉద్యోగాల గురించి  మొదటి కేబినెట్ లోనే ఆమోదించి, ఆ వెంటనే అసెంబ్లీలో చట్టం చేశాం.

పవన్ కళ్యాణ్ చదువుకున్నవారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే సెంట్ జోసఫ్ లో 10వ తరగతి చదివారని కూడా తెలుసు. మరి తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో నాకర్థం కాలేదు. రాజకీయాల కోసం దివీస్ పరిసరాల ప్రజలను దయచేసి రెచ్చగొట్టకండి, మనోభావాలను దెబ్బతీయకండి.

నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో స్థానిక యువతకు ఆ పరిశ్రమకు కావలసిన నైపుణ్యం అవసరాలను తెలుసుకుని, వారిని శిక్షణ ఇచ్చి, తీర్చిదిద్ది వారికి ఉద్యోగాలిస్తాం. ఆ ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించి ఆ యువతకు ఉచితంగా శిక్షణ. సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా అని పవన్ కళ్యాణ్ అడిగారు.

సోషల్ ఇంపాక్ట్ స్టడీ అనేది పారిశ్రామిక రంగంలో సర్వ సాధారణమైన విషయం. అది సెక్షన్ ఎ , సెక్షన్ బి కేటగిరీలను బట్టి  వాతావరణం, సమజాంపై ప్రభావితాల స్థాయిపై ఎన్విరాన్ మెంటల్ స్టడీ పరిశీలిస్తుంది. పరిశ్రమ స్ధాపనకు ముందే ...అది స్థానిక ప్రజలపై ఎలా ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ పరిశీలన జరుగుతుంది.

ఇవన్నీ కాక పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టడీ చేసి చివరిగా  అన్ని అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్నాకే పరిశ్రమకు సంబంధించిన అనుమతులు, మార్గదర్శకాలు, క్లియరెన్స్ ధృవపత్రాలు , ఎన్ఓసీలు ఇవ్వడం జరుగుతుంది. దివీస్ కు అనుమతులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదు.

మా ప్రభుత్వ హయాంలో వచ్చింది కాదు. అయినా మీరు మద్దతు ఇచ్చిన మీ గత ప్రభుత్వం. గతంలో మీరు చేసిన పొరపాట్లు, తప్పులను సరిచేసి ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నాం.

గత ప్రభుత్వానికి మద్దతు తెలిపింది మీరు కాదా?ఇవి అప్పుడు జరిగినవే కదా?  కొత్తగా ఇప్పుడు మీ మొసలి కన్నీరు ఎందుకు? అప్పుడు లేని  బాధ ఇప్పుడు కొత్తగా మీకెందుకు? 2015లో గత ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఏం చేశారు? దివీస్ పరిశ్రమ, స్థానిక ప్రజల ఆందోళనపై ప్రభుత్వం ప్రతిపక్షాల కన్నా ముందే స్పందించింది. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షమే.

స్పందించడంలో ఎప్పుడూ మేమే ముందు, ప్రజల భయాందోళనలను తొలగిస్తూ ఎటువంటి వ్యర్థాలను విడుదల చేయకూడదని క్లియర్ కట్ గా పరిశ్రమల శాఖ ద్వారా దివీస్ కు ఇప్పటికే లెటర్ రాశాం. కీలక నిర్ణయం తీసుకున్నాం.

దివీస్ ఆందోళన డిసెంబర్ 17న జరిగితే, 19వతేదీనే సమావేశమై ప్రజల ప్రయోజనాలు కాపాడే చర్యలు చేపట్టాం. స్థానిక మత్స్యకారులు, ప్రజల అంగీకారం లేకుండా ఒక్క ఇటుకా పెట్టకూడదని స్పష్టంగా దివీస్ యాజమాన్యానికి ఆదేశించాం" అని పేర్కొన్నారు.