ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (10:43 IST)

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లోనూ ఆరోగ్యశ్రీ

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లోని అనుబంధ ఆసుపత్రుల్లోనూ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద న్నిరకాల సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు పొందేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లోని అనుబంధ ఆసుపత్రుల్లోనూ కొన్నిరకాల సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు పొందేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబరు 1 నుంచి హైదరాబాద్‌లో 46, బెంగళూరు, చెన్నై నగరాల్లో మరికొన్ని ఆసుపత్రుల్లో ఈ సేవలు పొందొచ్చు.

పింఛను పరిధి విస్తరణ పైనా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కల్పిస్తున్న పింఛను సౌకర్యం పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీచేయనుంది. తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10వేలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు.

పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారికి, రెండు కాళ్లు లేదా చేతులు లేనివారికి కండరాల క్షీణతతో పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి జనవరి ఒకటి నుంచి నెలకు 5వేల పింఛన్‌ ఇస్తామని ఇటీవల హామీ ఇచ్చారు.