మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 జులై 2020 (10:35 IST)

తిరుప‌తమ్మ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు

ఏపీలో పసిద్ది గాంచిన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు దేవస్థానం సిబ్బందితో ఆల‌య ఈవో ఎన్‌విఎస్ఎస్ మూర్తి ట్రైల్‌ర‌న్ నిర్వహించారు.

గత నెలలో 10వ తేది నుండి దేవస్థానం పారంభించడానికి సమాయత్తం అవుతుండగా.. విజయవాడ నుండి పెన్షన్ కోసం వచ్చిన ఒక మ‌హిళ‌కు కరోనా లక్షణాలు క‌న‌బ‌డ‌డంతో వెంటనే విజయవాడ తీసుకుని వెళ్లారు. అనంతరం చాలామందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

ఎవరికీ కరోనా లేదు. కంటోన్మెంట్ జోన్ ఎత్తివేస్తూ మంగ‌ళ‌వారం కలెక్టర్ ఆదేశాలను జారీ చేసిన నేప‌ధ్యంలో బుధ‌వారం ట్రైల్‌రన్ నిర్వహించారు.

తొలుత దేవస్థానం క్యూలైన్లు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాబుల వద్ద కాళ్లు, చేతులు శుభ్రం చేసుకొని, శానిటేషన్ వినియోగించిన అనంత‌రం థ‌ర్మల్ స్కానింగ్ చేయించుకుని, రిజిస్టర్‌లో పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు నమోదు అనంత‌రం  అమ్మవారి దర్శనం చేయించుకున్నారు.

కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ అత్తులూరి అచ్యుతరావు, ఏఈఈవో జంగం  శ్రీనివాసరావు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజు, అర్చ‌కులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దేవస్థానం ఈవో అర్చకుల‌కు మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజ‌ర్లు పంపిణీ చేశారు.