మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (19:00 IST)

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు కష్టాలు తప్పవ్..

ఆంధ్రప్రదేశ్‌లోదేవాలయాలపై దాడులు చేసింది హిందుత్వవాదులేనని ఆదోనిలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ హిందుత్వ వాదం బలపడుతోందన్నారు. ఏపీలో బీజేపీ చాలా మౌనంగా దూసుకెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు. హిందుత్వవాద బీజేపీని జగన్ అరికట్టే ప్రయత్నం చేయాలన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో జగన్‌కు కష్టాలు తప్పవని సూచించారు. 
 
ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఇంటికే పరిమితం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. తన సమావేశానికి సీఎం జగన్‌ అనుమతి ఇవ్వలేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. 
 
ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బెకార్ అని అసదుద్దీన్‌ ఎద్దేవా చేశారు. జగన్ మైనార్టీలను ఓటు రూపంలో వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం జగన్‌రెడ్డి గాలికి వదిలేశారని అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.