బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 మే 2020 (15:14 IST)

కరోనా బాధితులకు అవినాష్ వీడియో కాన్ఫరెన్సు పరామర్శ

కరోనా బాధితులకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.

కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారితో శనివారం అయన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ చికిత్స పొందుతున్న, కొరెంటైన్ లో వున్నా బాధితులను పరామర్శించారు. అక్కడ జరుగుతున్నా వైద్య సదుపాయాల గురించి అరా తీశారు. కరోనా సోకినంత మాత్రాన  తమకేదో ముప్పువాటిల్లిందన్న అపోహలు వీడాలని సూచించారు.

వ్యాధి నియంత్రణ అయిన  తరువాత ప్రతివక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో వారి వారి ఇళ్లకు క్షెమంగా చేరుకోవాలని కాంక్షించారు.

జనజీవనం స్తంభించిపోయాన ప్రస్తుత తరుణంలో పేదలకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. బాధితుల ఆర్థిక స్థితి గతులను పరిగణలోకి తీసుకుని ఆయా కుటుంబాలకు నిత్యవసరాలు కూరగాయలు, ఆహారసదుపాయాలు అందచేస్తునట్లు పేర్కొన్నారు.