గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (14:03 IST)

చీరాల బీచ్‌‍లో వసుంధరతో కలిసి బాలయ్య సందడి

సంక్రాంతి సంబరాల కోసం తన అక్క-బావ దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఊరైన కారంచేడుకు సినీ నటుడు బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరలు వచ్చారు. వారు గ్రామంలో భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకున్నారు. 
 
కనుమ పండుగ రోజున తన బంధువులతో కలిసి బాలకృష్ణ దంపతులు చీరాల సమీపంలోని వాడరేవు బీచ్‌కు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య సతీమణి వసుంధర‌ను బీప్‌ను బీప్‌లో ఎక్కించుకని సరదాదాగా బీచ్‌ రైడింగ్‌లో పాల్గొన్నారు. కాగా, శనివారం పురంధేశ్వరి నివాసంలో సరదాగా బాలయ్య గుర్రమెక్కి సందడి చేసిన విషయం తెల్సిందే.