ఏపీ సీఎం కుర్చీలో భారతీరెడ్డి? అందుకే జగన్ అలా చేశారా?
వైసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం జరిగిన నేపథ్యంలో.. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్‌కు జైలుకెళ్లాల్సిన పరిస్థితే వస్తే.. ముఖ్యమంత్రి కుర్చీలో తన భార్య భారతీరెడ్డిని కూర్చోబెట్టేందుకే జగన్ తన తల్లి వైఎస్ విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి సాగనంపారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి.
గౌరవాధ్యక్ష పదవికి విజయలక్ష్మితో బలవంతంగా రాజీనామా చేయించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా ఇడుపులపాయలో రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి తల్లి విజయలక్ష్మితో కలిసి జగన్ ప్లీనరీకి వచ్చారు.
వాస్తవానికి ఆమె శనివారం వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ తొలిరోజునే రావడంతో ఈ కథనాలు నిజమనే వాదన వినిపిస్తోంది. వైసీపీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు విజయలక్ష్మి ప్రకటించేశారు. తన కుమార్తె, వైఎస్సార్‌టీపీ నాయకురాలు షర్మిల తెలంగాణలో ఒంటరి పోరు చేస్తున్నందున ఆమెకు మద్దతిచ్చేందుకే తానీ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. తన కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసినందునే వైసీపీ నుంచి వైదొలగాలని నిర్ణయించానని తెలిపారు.
ఇకపోతే అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేస్తే.. జగన్‌కు చట్టపరమైన చిక్కులు తప్పవని.. అదే జరిగితే సీఎం స్థానంలో భార్య భారతీరెడ్డిని కూర్చోబెట్టాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగానే వారిద్దరినీ ఆయన పొరుగు రాష్ట్రానికి సాగనంపారని పేర్కొంటున్నాయి.