కర్నూలులో టీడీపీ షాక్... వైకాపాలో చేరిన అఖిల ప్రియారెడ్డి మేనమామ

tdp logo
Last Updated: ఆదివారం, 17 మార్చి 2019 (11:25 IST)
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దెబ్బపై దెబ్బ తగులుతుంది. టీడీపీకి చెందిన పలువురు నేతలు వైకాపాలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా ఏపీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియా రెడ్డి మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి వైకాపా తీర్థంపుచ్చుకున్నారు.

హైదరాబాద్, లోటస్ పాండ్ జగన్ నివాసానికి వచ్చిన ఎస్వీ జగన్ రెడ్డి, పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆళ్లగడ్డకు చెందిన జగన్‌, ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ జగన్ రెడ్డి వైసీపీలో చేరికతో ఆళ్లగడ్డలో పార్టీ మరింతగా బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికే ఆళ్లగడ్డలో పేరున్న ఎస్వీ సుబ్బారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు, నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశం ఉంది. తనకు టిక్కెట్ కేటాయించని పక్షంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. మొత్తంమీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీని వీడి వైకాపాలో చేరేందుకు అనేక మంది నేతలు క్యూకడుతున్నారు.దీనిపై మరింత చదవండి :