ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (15:10 IST)

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. ఆ నలుగురికీ ముందే తెలుసు!?

ys jagan
వైఎస్ వివేకా హత్య కేసులో మరో సంచలన విషయాన్ని సీబీఐ బయటపెట్టింది. వివేకా హత్య విషయం ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసునని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాశ్ రెడ్డి పేరును మరోసారి ప్రస్తావించింది. హత్య జరిగిన అనంతరం వేకువ జామున ఉదయ్ కుమార్ రెడ్డి ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో ఉన్నారని పేర్కొంది. దీనికి సంబంధించి లొకేషన్ వివరాలను బయటపెట్టింది.
 
హత్య విషయం తెలిసిన 2 నిమిషాలలో ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారని సీబీఐ అధికారులు తెలిపారు. వీరి లొకేషన్ వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నలుగురూ కలిసి హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను తొలగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని సీబీఐ అధికారులు తెలిపారు.