శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (15:01 IST)

డిసెంబర్​ 15 లోపే బీజేపీ రాష్ట్ర చీఫ్​ ఎన్నిక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను డిసెంబర్​ 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆ పార్టీ జాతీయ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జేపీ నడ్డా ఆదేశించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక డిసెంబర్ 15 నుంచి 31 లోపు ఉంటుందని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా బీజేపీ పోటీ చేస్తుందన్నారు. క్లస్టర్ ఇన్‌చార్జులు, అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేసినవారు అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. 
 
50 మందికి సభ్యత్వం ఇప్పించిన వారికే క్రియాశీలక సభ్యత్వం ఇస్తామని చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. 31 జిల్లాల ఇన్‌చార్జ్‌ల నియామకానికి అభ్యర్థులను గుర్తించాలని రాష్ట్ర నాయకులను ఆదేశించారు. సెప్టెంబరు 20 కల్లా బూత్ కమిటీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని, అక్టోబరులో మండల అధ్యక్షులను, నవంబర్​లో జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్​ జిల్లా నేత భూపతి రెడ్డిని రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్​ అధికారిగా నియమించారు.