శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (17:11 IST)

ఏపీలో కొంద‌రు మంత్రుల పేరు కూడా ఉచ్ఛ‌రించ‌డం నాకిష్టం లేదు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, ఇక్కడ కొంత మంది మంత్రులు అభ్యంతరకర భాషను వాడుతూ, రాజకీయ‌ దిగజారుడుతనాన్ని నిరూపించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శించారు. విజయవాడ కృష్ణలంకలోని రాణీగారి తోటలో  బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్నిఆయ‌న ప్రారంభించారు. 
 
ప్ర‌ధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన  వైద్య శిబిరం స‌భలో మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులు ఇటీవల ఉపయోగించిన భాషను ప్రస్తావిస్తూ, మంత్రుల పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితులు వారు ఉపయోగించిన భాష వల్ల కలుగుతోందని అసహనం వ్యక్తం  చేశారు.
 
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఎవరినీ అజమాయిషీ చేయద‌ని, అయితే మీరు ఎవరిని ప్రేరేపించి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారంటూ సోమువీర్రాజు రౌద్ర స్వరూపంతో  ప్రశ్నించారు. అధికార పార్టీతో సహా అన్నిపార్టీలు వినియోగిస్తున్నభాషపై  సోము అసహనం వ్యక్తం చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లే జరుగుతోంద‌ని, రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేయడం లేదని, జనసేన రహదారులపై పడిన గోతులు పూడుస్తూ, ఉద్యమిస్తోంద‌న్నారు. 
 
పశ్చిమ‌ బెంగాల్ లో బిజెపి కార్యకర్తల‌పై దాడులు జరుగుతున్నాయ‌ని, వాపమపక్షాలు అక్కడి అన్యాయం  గురించి నోరెత్తవ‌ని ఆరోపించారు.కేరళ, పశ్చింబెంగాల్ లో బిజెపి, సంఘ పరివార్ పై జరుగుతున్న దాడులపై వీరెవ్వరికీ నోరుపెగలదు అంటూ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లే జరుగుతోంద‌ని, రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేయడం లేదని బిజెపి చెప్పింది. జనసేన రహదారుల పై  పడిన గోతు లు పూడుస్తు ఉద్యమిస్తోంది. నైతికంగా దిగజారి పోయి  మాట్లాడితే  ఆంధ్ర ప్రజానీకం హర్షించరని  వివరించారు.
 
బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల గురించి సునీల్జీ ప్రస్తా విస్తూ,  రాష్ట్ర ప్రజలు పెనంపై  నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారార‌ని వివరించారు. ఇసుక దగ్గర నుండి మద్యం వరకు అన్ని విభాగాల్లోనూ అధికార పార్టీ మాఫియాను ప్రవేశ పెట్టిందని విరుచుకుపడ్డారు.
 
ఈ  కార్యక్రమంలో  బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్,  బిజెపి జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం, ప్రొటాకాల్  కన్వీనర్ తోట శివనాగేశ్వరరావు , బిజెపి రాష్ట్ర నేతలు పాతూరి నాగభూషణం, దాసం ఉమామహేశ్వర రాజు, డాక్టర్ రాసిక్ సంఘ్వీ, అడ్డూరి శ్రీరాం, మండల పార్టీ అధ్యక్షుడు బొప్పన మురళి తదితరులు పాల్గొన్నారు.
 
రాణిగారి తోటలో  బిజెపి నేత పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వితరణ కార్యక్రమంలో బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  చేతుల మీదుగా కాలనీవాసులకు బియ్యం పంపిణీ చేశారు.