1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 25 మే 2023 (22:48 IST)

నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్.. కారణం ఏంటో తెలుసా?

nara lokesh
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరుగనున్న కారణంగా.. లోకేష్ పాదయాత్రకు బ్రేక్ వేశారు. 
 
ఆపై తిరిగి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 30న ప్రారంభం కానుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా గురువారం లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ఇక నారా లోకేష్ కడప ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. 
 
ప్రత్యేక విమానంలో అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం అమరావతి నుంచి బయల్దేరి.. రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు.