శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (20:35 IST)

ఏపీలో కోవిడ్ -19 నివారణకు విస్తృత చర్యలు

ఏపీలో కరోనా నివారణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా సమీక్షించి చర్యలకు నడుం బిగించింది. ఆ మేరకు ఆయా జిల్లాల వారీగా వివరాలు ప్రకటించింది.
 
విశాఖ జిల్లాలో పరిస్థితి:
విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ దృష్టికి వచ్చిన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
–  కరోనా పాజిటివ్‌ కేసులు: 3
–  విదేశాల నుంచి వచ్చినవారు: 1
–  అనుమానిత కేసుల్లో పరీక్షలకు పంపించి, రిపోర్టులు రావల్సివని: 61
–  ఐసోలేషన్‌లో ఉన్న వారి సంఖ్య: 30
– ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలు: 12 
 
విజయవాడ:
విజయవాడలో సమావేశమైన ఉన్నతాధికారులు నిత్యావసర వస్తువుల పంపిణీ మార్గాలపై చర్చించారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ మధుసూదన్‌రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవిలత, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తదితరులు వ్యాపారులతో సమావేశమయ్యారు.

హమాలీలపై పోలీసులు దాడి చేశారని, కాబట్టి హమాలీలతో పాటు, సరుకులు రవాణా చేస్తున్న వాహనాలకు ప్రత్యేక పాసులు ఇవ్వాలని సమావేశంలో టోకు వ్యాపారులు కోరారు. 

రైతుబజార్లలో కూడా తక్కువ సంఖ్యలో దుకాణాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు కూడా కనీసం ఒక మీటర్‌ దూరంలో నిలబడి కొనుగోళ్లు చేసే విధంగా మార్కింగ్‌ చేయాలని నిర్ణయించారు. రానున్న 21 రోజులు నిత్యావసరాలు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

వీలుంటే సరుకుల డోర్‌ డెలివరీ కోసం ప్రయత్నిస్తామని, ఆ దిశలో వ్యాపారుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామని, మరోవైపు రైతు బజార్ల వికేంద్రీకరణపై దృష్టి పెట్టామని అధికారులు చెప్పారు. 
 
హోం ఐసొలేషన్‌పై నిర్లక్ష్యం–కేసు
విదేశాల నుంచి తిరిగివచ్చి, హోమ్‌ ఐసోలేషన్‌ పాటించని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశామని అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు వెల్లడించారు. అనంతపురం రూరల్‌ మండలానికి చెందిన ఒక వ్యక్తి  అమెరికా నుంచి తిరిగి రాగా, హోమ్‌ ఐసోలేషన్‌ లో ఉంచామని, అయితే ఆ వ్యక్తి హోమ్‌ ఐసోలేషన్‌ నిబంధనలు పాటించకుండా ఇంటి బయట తిరుగుతున్నందున కేసు నమోదు చేసి, హాస్పిటల్‌ క్వారంటైన్‌లో చేర్పించామని కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
గ్రామాల్లో స్వయం కట్టడి
మరోవైపు శ్రీకాకుళంతో పాటు, పలు జిల్లాలలో ప్రజలు స్వచ్ఛందంగా కట్టడి విధించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఎం.నరసాపురం, చిన్న తుంగాంలో వేరే ప్రాంతాల నుంచి ఇతరులెవ్వరూ ఊళ్లలోకి రాకుండా రహదారికి అడ్డంగా గ్రామస్తులు  కంచెలు ఏర్పాటు చేసారు. 
 
విరాళాలు
కోవిడ్‌–19 నివారణ చర్యలకు ఉపయోగపడేలా వైయస్సార్‌సీపీ ఎంపీల విరాళం ప్రకటించారు. ప్రధాని సహాయ నిధికి ఒక నెల జీతం, సీఎం సహాయ నిధికి మరో నెల జీతం విరాళంగా ఇవ్వాలని పార్టీ ఎంపీలు నిర్ణయించారు. 

కరోనా కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని, ఇదే సమయంలో రోజూ పని చేస్తే కానీ పొట్ట గడవని వారెందరో ఉన్నారని, వారిని అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే ఈ విరాళాలు ఇవ్వాలని నిర్ణయించామని వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో వైయస్సార్‌సీపీ పక్ష నేత పి.వి.మిథున్‌ రెడ్డి వెల్లడించారు.

భావ సారూప్యత ఉన్న వ్యక్తులు కూడా తమ వంతు సహాయం చేయాలని వారు కోరారు. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి వ్యక్తిగతంగా సీఎం సహాయనిధికి రూ.1.01.111 విరాళంగా ఇచ్చారు.
 
స్పాట్‌ బిల్లింగ్‌ నిలిపివేత
కరోనా వైరస్, దేశమంతా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘స్పాట్‌ బిల్లింగ్‌‘ ను నిలిపివేయాలని విద్యుత్‌ సంస్థలు నిర్ణయించాయి. గత మూడు నెలల సగటు విద్యుత్తు వినియోగాన్ని లెక్కించి, ఆ మేరకు మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణించాలని విద్యుత్‌ శాఖ నిర్ణయించింది.

ఆ లెక్కలను విద్యుత్‌ సంస్థలు వెబ్‌సైట్‌లో ఉంచనున్నాయి. వినియోగదారులు కూడా తమ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. వాస్తవ వినియోగం ప్రకారం విద్యుత్‌ బిల్లులలో ఏమైనా తేడా ఉంటే, తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని విద్యుత్‌ సంస్థలు నిర్ణయించాయి. 
 
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
* నెల్లూరు లో అన్ని డివిజన్స్ లో హోమ్ ఐసోలేషన్ లో  650 బెడ్స్ సిద్ధం, రేపటి కి 2,200 అందుబాటులోకి 
* కేంద్ర ప్రభుత్వం 14 వరకు ప్రకటించిన లాక్ డౌన్ ను అందరూ పాటించాలి
* ప్రజలు ఇళ్లలోనే ఉంటూ సహకరిస్తున్నారు
* వైద్యపరం గా ఎటువంటి  ఆకాంక్షలు లేవు
* డిజాస్టర్ మెనేజ్మెంట్ లో  భాగంగా ఇన్సిడెంట్  కమాండర్స్  ఏర్పాటు 
 * మొబైల్ రైతు బజార్లు  అందుబాటులోకి
* జిల్లా వ్యాప్తంగా రైతుబజార్లలో నిత్యవసరాలు ఉదయం 6 నుంచి 11, సాయంత్రం 4 నుంచి 7 వరకు ప్రజలకు కొనుగోలుకు అనుమతి
* అధికారుల సూచన మేరకు ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని కలెక్టర్ కోరారు
* ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఎవరూ లేరు
* ముందస్తుగా స్వీయ గృహ  నిర్భంధంలో ముగ్గురు (3)  ఉన్నారు
* హోం ఐసోలేషన్ లో 760  మంది ఉన్నారు
* జిల్లాలో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు
*   నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి లో 40 బెడ్స్ తో  ఐసోలేషన్ వార్డు 
*  అత్యవసర సమయంలో  వినియోగించుకోవడానికి  వెంటిలేషన్ సౌకర్యం  కల్పించారు
* అత్యవసరం కింద రెడ్ క్రాస్  మరియు తదితరలు జిల్లాలో 25,000  మంది పని చేస్తున్నారు
 
శ్రీకాకుళం జిల్లా:
అత్యవసర సరుకులు, నిత్యావసర సరుకుల వర్తకులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్  జె నివాస్ సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపిన కలెక్టర్.. జిల్లా వ్యాప్తంగా ధరలను పరిశీలిస్తున్నాం. నిర్దేశిత ధరల కంటే అధిక ధరలకు విక్రయించరాదని  వర్తకులకు సూచించారు.
 
కూరగాయలు, పాలు, చేపలు, మాంసం, పప్పులు, ఉప్పు  తదితర అన్ని అత్యవసర, నిత్యావసర సరుకులను ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో  ఉంటాయని.. రద్దీ ఉండకూడదనే సమయం పెంచామన్నారు.
 
ఎక్కడా 5 గురు కంటే ఎక్కువ గమిగూడి ఉండరాదు.. దుకాణాలు వద్ద ఒక వ్యక్తికి మరో వ్యక్తికి కనీసం ఒక మీటరు దూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సూపర్ మార్కెట్లకు అనుమతి లేదని... నిత్యావసర సరుకుల రవాణాకు ఎటువంటి అవాంతరాలు ఉండవని ఆయన తెలిపారు. 
 
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లాలో కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటుచేసామని, అయితే నిత్యావసర సరుకులకు ఎటువంటి కొరతలేదని జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేసారు. నిత్యావసర సరుకులు దొరకవనే భావనతో ప్రజలు సమూహంగా వచ్చి కొనుగోలు చేయవలసిన పనిలేదని పేర్కొన్నారు. 
 
రైతు బజారులో రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల, పురుషుల డిగ్రీ కళాశాల, పి.యస్.యన్.సి.హెచ్.స్కూల్, యన్.టి.ఆర్. నగరపాలక ఉన్నత పాఠశాల మైదానాలలో కాయగూరల మార్కెట్లను ఏర్పాటు చేశారు.
 
ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ఎన్.టి.ఆర్.నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానాలలో ఏర్పాటు చేసిన రైతు బజార్లను జిల్లా కలెక్టర్ జె.నివాస్, సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులుతో సంయుక్తంగా పరిశీలించారు.
 
కాయగూరలు విక్రయిస్తున్న ధరలను కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసర సరుకులను, కాయగూరలు, పండ్లను విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.   
 
జిల్లాలో అనుమాన స్పదంగా ఉన్నవారిని క్వారింటైన్ అబ్జర్వేషనులో ఉంచామని, కరోనా లక్షణాలు కనిపిస్తే అటువంటి వారి వివరాలు తెలియజేయాలని ప్రజలను కలెక్టర్  కోరారు. 
 
సంతబొమ్మాలి మండలం ఎం.నరసాపురం, చిన్న తుంగాం గ్రామాల్లో వాహనాలు, ఇతరుల వ్యక్తులు తమ గ్రామంలోకి  రాకుండా రహదారికి అడ్డంగా స్వయంగా గ్రామస్తులే కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. 
 
అరసవిల్లిలోని శ్రీసూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఉగాది పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారు  అర్చక, వైదిక బృందంతో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
 
ప్రకాశం జిల్లా
* జిల్లా కి 1939 మంది విదేశాల నుండి రాగా 144 మంది సస్పెక్టెడ్ గా ఉన్నారు
* విదేశాల నుంచి వచ్చిన వారందర్నీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచమన్నారు
* ఐసోలేషన్ లో 15 మంది ఉన్నారు, ఒక పాజిటివ్ మరియు ముగ్గురు అనుమానిత లక్షణాలతో 
*  లాక్ ఔట్ కి జిల్లాలో పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ చెప్పారు
* వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలన్న కలెక్టర్
* నిత్యవసరాలకు ఎటువంటి  ఇబ్బంది లేకుండా రైతు బజార్లలో ఏర్పాట్లు
* ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని పిలుపు
* అనుమానిత లక్షణాలతో ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు
* ముందస్తు జాగ్రత్త చర్యలతో వ్యాధిని పూర్తిగా  అరికట్టవచ్చని కలెక్టర్ 
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  సూచన మేరకు ఏప్రిల్ 14 వరకు  లాక్ ఔట్ ను ప్రజలు  పాటించాలన్నారు
*  రైతు బజార్లో కూరగాయలు, నిత్యవసర సరుకులకు ఇంటికి ఒక్కరు వచ్చి కొనుగోలు చేయాలి
* జనసంచారాన్ని, వాహనాల నియంత్రణను పూర్తిగా అదుపులోకి తీసుకున్నామన్న ఎస్పీ
* జిల్లాను ఏడు జోన్లుగా విభజించి ఉపకలెక్టర్ తో ఏడు బృందాల నియామకం 
* కరోనా వైరస్ ను జిల్లా నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా గృహాల్లోనే ఉండి సహకరించాలన్నారు
 
కృష్ణాజిల్లా: 
కరోనా నేపథ్యంలో కృష్ణ జిల్లా మొత్తం లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేశారు.
కలెక్టర్ గారు ఉదయం ట్రెడర్ యూనియన్లతోనూ, ప్రైవేటు డాక్టర్లతోను సమావేశం నిర్వహించారు
అనంతరం నిత్యావసర వస్తువుల పంపిణీ మార్గాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కూరగాయలను డోర్ డెలివరీ చేయడంపై ప్రధానంగా చర్చించారు
 
విజయవాడ డివిజన్:
ప్రస్తుతం ఉన్న రైతు బజారులలో కూరగాయలు కోనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో జనం గుమిగూడుతుండడంతో  గురువారం నుంచి రైతు బజార్ లను పెంచుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్, విఎంఎంసి కమిషనర్ లతో కలిసి కూరగాయలు, పాలు, కిరాణా సరుకుల హోల్ సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. నగరవాసులకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని వర్తకులకు సూచించారు.

ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా తీసుకుని ధరలు పెంచితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అజిత్ సింగ్ నగర్, పాయకాపురం రైతు బజార్లను బసవ పున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విజయవాడ పరిధిలో ఉన్న 20 ప్రైవేటు ఆసుపత్రిలకు చెందిన డాక్టర్లతో కలెక్టర్ గారు సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ చికిత్సకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని కోరారు
 
గుడివాడ డివిజన్:
గుడివాడ డివిజన్ లో లాక్ డౌన్  ప్రశాంతంగా జరిగింది. ఏఎస్పి గారు గుడివాడ లో పర్యటించి లాక్ డౌన్ ను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 14 వరకు లాక్ డౌన్ నేపథ్యంలో 144  సెక్షన్ అమలులో ఉంటుందని ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. 144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే IPC సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేసి స్టేషను లో ఉంచుతామని హెచ్చరించారు.

మంత్రి కొడాలి నాని తన నివాసంలో ఆర్డివో, మెడికల్ ఆఫీసరులతో సమీక్ష నిర్వహించారు. వాలంటరీల ద్వారా రేషన్ కార్డుదారులందరకీ నిత్యావసర వస్తువుల ఇంటివద్దే అందిస్తామని చెప్పారు. వర్తకులు ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోం ఐసోలేషన్ లో ఉన్నవారు : 206 మంది
 
 
న్యూజివీడు డివిజన్
న్యూజివీడు డివిజన్ లో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేశారు. సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ డివిజన్‌లో పరిస్థితులను పర్యవేక్షించారు. హోం ఐసోలేషన్ లో ఉన్నవారు : 301
 
మచిలీపట్నం డివిజన్:
ఎస్పీ రవీంద్ర బాబు నగరంలో లాక్ డౌన్ ను పర్యవేక్షించారు. ఆర్డివోతో కలిసి రోడ్ల పక్కన నివసించే పేదలకు ఆహార పోట్లలను పంపిణీ చేశారు. ఈనెల 20 కజకిస్తాన్ నుంచి వచ్చిన కరొనా అనుమానిత  ఎంబిబిఎస్ విద్యార్థిని రిపోర్ట్ నెగటివ్( కరోనా లక్షణాలు లేవని) వచ్చిందని ఆర్డివో ప్రకటించారు. హోం ఐసోలేషన్ లో ఉన్నవారు : 76
 
పశ్చిమ గోదావరి లాక్ డౌన్:
లాక్ డౌన్ తో నాలుగో రోజైన బుధవారం నాడూ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం
జిల్లా లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్న అధికార యంత్రాంగం 
జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్రి నాని, మంత్రులు తేనేటి వనిత, శ్రీరంగనాథరాజు తదితరులు ఆయా శాఖాధికారులతో సమీక్ష.
క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రుల ఆదేశం
నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచేలా జిల్లా అధికారులు కృషి
జిల్లా హోల్ సేట్ మర్చంట్స్ అసోసియేషన్ తో కలెక్టర్ ముత్యలరాజు, ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ సమావేశం
మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని వ్యాపారులకు సూచన
కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక
హమాలీలకు, వాహన డ్రైవర్లకు, నిత్యావసర వస్తువుల షాపు సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని హామీ
నిత్యావసర వస్తువుల వాహనాలు, ఎమర్జెన్సీ మెడికల్ వాహనాలకు మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తామని వెల్లడి
మెడికల్, నిత్యావసర వస్తువుల వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే కేసులు నమోదు  చేస్తామని హెచ్చరిక
తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వీడియో కాన్ఫరెన్స్
21 రోజులు పాటు జరిగే లాక్ డౌన్ పై ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని ఆదేశం
లాక్ డౌన్ కాలంలో నిత్యావసర వస్తువుల కొరత రానీయొద్దని ఆదేశం
నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సమయం
కొనుగోలు సమయంలో సామాజిక దూరం పాటించాలని ప్రజల్లో అవగాహన కల్పించండి.
రైతు బజార్లలో రద్దీని తగ్గించేలా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలోనూ, అల్లూరి సీతారామారాజు స్టేడియంలోనూ ప్రత్యేక రైతు బజార్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడి
వినియోగదారుడికి ఏ వస్తువైనా రెండు కిలోల చొప్పున మాత్రమే అందించేలా చర్యలు
కుటుంబంలో ఒకరు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు బయలకు రావాలి.
ఉదయం 10 గంటల తరవాత లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశం
విధులకు హాజయ్యే ఉద్యోగులకు ఐడీ కార్డులు తప్పనిసరి...వాటిని చూపితేనే పోలీసులు అనుమతిస్తారు.
నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ మెడికల్ వాహనాల మినహా ఇతర వాహనాలను పోలీసులు సీజ్ చేయాలని ఆదేశం
సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్ లు పెట్టేవారిపై కఠిన చర్యలు
వార్తల సేకరణలో భాగంగా మీడియా సిబ్బందికి ఆటంకం కలించొద్దు...
ఏలూరు ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామారాజు స్టేడియాల్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లను తనిఖీ చేసిన జేసీ వెంకట్రామిరెడ్డి
కూర గాయాల ధరలపై ఆరా...
కూర గాయల కొనుగోలు సమయంలో వినియోగదారులు రెండు మీటర్ల దూరంలో ఉండాలని సూచించిన జేసీ
ఏలూరు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, భీమవరంతో జిల్లాలో ఉన్న రహదారులన్నీ నిర్మానుష్యం
కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చైతన్య కార్యక్రమాలతో ఇళ్లకే పరిమితమైన జిల్లా వాసులు
తెరుచుకోని వాణిజ్య సముదాయాలు
తెరుచుకున్న మెడికల్, నిత్యావసర వస్తువుల విక్రయ షాపులు...
జిల్లాలో కరోనా కేసు నమోదుల కాలేదని అధికారుల వెల్లడి
ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, సామాజిక దూరం పాటించాలని వినతి
 
విజయనగరం జిల్లా:
కరోనా లాక్ డౌన్ అమలు, నిత్యావసర సరుకుల పంపిణీ పై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ సూపరింటెండెంట్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డి.జి.పి. గౌతం సవాంగ్  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్ డా ఎం హరిజవహర్ లాల్, ఎస్.పి. బి. రాజకుమారి, జే.సి. జి.సి. కిషోర్ కుమార్, డి.ఆర్.ఓ. జె.వెంకట రావు, ఓ.ఎస్.డి. జె.రామ్మోహన్ తదితరులులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. 
 
విజయనగరం జిల్లా కేంద్రం, అసెంబ్లీ నియోజవర్గాల్లో  మొత్తం 70 కేంద్రాల్లో మొత్తం 1455 క్వారంటేయిన్ రూమ్ లను ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు 2105 బెడ్ లను ఏర్పాటు చేశారు. మొత్తం 49 ప్రభుత్వ భవనాల్లో వీటిని ఏర్పాటు చేశారు
 
విజయనగరం జిల్లాలోని బలిజిపేట మండలంలోని విల్లిభద్ర, పెదగుడబ, రావుపల్లి గ్రామాల్లో ప్రజలు తమ గ్రామాల్లోకి ఇతరులు ఎవ్వరూ ప్రవేశించకుండా స్వచ్ఛందంగా వారే రోడ్లను దిగ్బంధించారు
 
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి లో రెండు మీటర్ల దూరం పాటిస్తూ ప్రజలంతా కూరగాయలు కొనుగోలు చేశారు. కూరగాయల దుకాణాల ఏర్పాట్లను స్వయంగా సబ్ కలెక్టర్ టి ఎస్ చేతన్ పరిశీలించారు.
 
కర్నూలు జిల్లా:
1)కర్నూలు జిల్లాలో నాలుగో రోజు ఉగాది పండుగ నాడు కట్టుదిట్టంగా కొనసాగిన లాక్ డౌన్.... నిర్మానుష్యంగా పలు రోడ్లు... ఇంటికే పరిమితమైన ప్రజలు... పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప
2)చీఫ్ సెక్రటరీ గారు, డిజిపి గారు కోవిడ్-19 లాక్ డౌన్ పై  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, డిఐజి, ఎస్పీ, జేసీ, జేసీ2 తదితర అధికారులు
3)కరోనా వైరస్ పై జిల్లా స్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలి కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్.
4)జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కరోనా  ఐసోలేషన్/ క్వారంటైన్ లలో సదుపాయాలు పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్.
5)రైతు బజారును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్.  కూరగాయల, నిత్యావసర సరుకుల రేట్ల ప్రదర్శన. కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులకు హ్యాండ్ వాష్ ఏర్పాటు,  కనీసం పది అడుగుల దూరం పాటించేలా మార్కెటింగ్ శాఖ చేసిన ఏర్పాట్ల పరిశీలన
6)విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి...  క్షుణ్ణంగా సర్వే చేయడానికి ప్రతి పది మందికి ఒక స్పెషల్ ఆఫీసర్..   గ్రామ వాలంటీర్ల ద్వారా రీ సర్వేను బాగా చేయించాలని జెసి, జడ్ పి సీఈఓ, డిపిఓ, మునిసిపల్ కమీషనర్లను, నోడల్ అధికారులు, మెడికల్ అధికారులకు సూచించిన కలెక్టర్
7)జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కోవిడ్ 19 క్వారంటైన్ సెంటర్లు సిద్ధం చేసి అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్.
8)కర్నూల్ నగర శివారులోని రాయలసీమ విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన క్వారంటైన్
సెంటర్ ను పరిశీలించిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్.
9) కర్నూలు నగరంలో  అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్స్ ద్వారా సోడియం హైపో క్లోరైట్ డిస్ఇన్ఫెక్ట్0ట్ స్ప్రే 
10) విదేశీ ప్రయాణం చేసి తిరిగి కర్నూలు వచ్చిన వారిని గుర్తించే విధుల్లో అలసత్వం ప్రదర్శించిన కర్నూలు మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డా.పుష్పలత పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్
11) దుబాయ్, ఇజ్రాయెల్, కజికిస్తాన్ లాంటి విదేశాల నుండి తిరిగి వచ్చి 14 రోజుల హోమ్ క్వారంటైన్ నిబంధనలను పాటించకుండా బయట తిరుగుతున్న దేవన కొండ, గడివేముల, మిడుతూరు మండల వాసులు ముగ్గురిని స్థానికులు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేయించి కర్నూలు సమీపంలో రాయలసీమ యూనివర్సిటీలో 225 బెడ్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ హోమ్ క్వారన్టైన్ కు తరలింపజేసిన జిల్లా కలెక్టర్
12) ఇన్సిడెంట్ కమాండర్ లగ తహసీల్దార్ లను నియామకం చేసిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్.
 
గుంటూరు జిల్లా:
1. కరోనా గురించి తాజా అప్ డేట్ : ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు..మొతం 21 మంది అనుమానుతుల్లో 14గురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది..మిగితా 7 మందికి రిపోర్టు రావాల్సి ఉంది..జిల్లా అంతటా అధికారులు కరోనా వ్యాధి ప్రభలకుండా తగిన ముందస్తు  చర్యలు తీసుకుంటున్నారు.. ప్రజలని అప్రమత్తం చేస్తూ కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు
2. పాజిటివ్ కేసుల సంఖ్య : 0
3. నెగెటివ్ కేసుల సంఖ్య : 14
4. ఐసోలేటెడ్ వార్డుల సంఖ్య:05
5. గుంటూరు జీవీహెచ్,లో 100, గుంటూరు ఫీవర్ ఆసుపత్రిలో 50, తెనాలి ఆసుపత్రిలో 20 బెడ్స్ సిద్దంగా ఉంచారు..మరికొన్ని ప్రవేటు ఆసుపత్రుల్లో సిద్దం చేస్తున్నారు...
దాదాపు ఇప్పటి వరకు 2651 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చినట్లు సమాచారం.. వీరిలో 2431మందిని హోమ్ ఐసోలేషన్, 15ది హాస్పటల్ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు..చెప్పినా వినకుండా జాగ్రత్తలు పాటించని 53 మందిని నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 
6. రవాణా వ్యవస్థ పనితీరు: జిల్లాలో 100శాతం లాక్ డౌన్ అమలౌతుంది..ఎక్కడిక్కడ చెక్ చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.నిత్యవసర సరుకుల రవాణాకు ఇబ్బందిలేకుండా ఉండేలా వెహికల్ పాస్ లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.
7. నిత్యవసర రేట్ల గురించి: గతంలో కంటే కొంచెం రేట్లు పెరిగినట్లు సమాచారం.. సరుకు డిమాండ్ ఉండటంతో రేట్లు కొంచెం పెరుగుతాయంటున్న వ్యాపారులు..ప్రతీ రోజు మూడో వంతు రిటైల్ వ్యాపార దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు సరుకులు అమ్మెలా చర్యలు చేపట్టారు. గుంటూరు కూరగాయల మార్కెట్ తక్కువ ప్లేస్ లో ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంది..దీనిని ద్రుష్డిలో ఉంచుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ గంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం తోపాటు  దాదాపు 10 ప్రాంతాలను గుర్తించి అక్కడ అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నారు..
 
8. ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు: రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు.. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు..కాల్ సెంటర్, టోల్ ఫ్రీ నంబర్ కు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు
 
9. పోలీసుల పనితీరు: స్ట్రాంగ్ ఉంది.ఐడీ కార్డులుంటే తప్ప బయట తిరగనివ్వలేదు..బారికేడ్లతో ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తూ లాక్ డౌన ను పగడ్బందీగా  అమలును  చేస్ఉన్నారు. వాహనాలను కూడా కట్టడి చేస్తూ ఎక్కువ మంది గుమి కూడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
 
10. కలెక్టర్ సమీక్షలు ( డివిజన్ వైజ్): ఈరొజు జిల్లా కలెక్టర్ నిత్యవసర సరుకులు సమీక్ష, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నారు. సాయంత్రం హోల్  మార్కెట్ వ్యాపారులతో భేటీ కానున్నారు...
 
విశాఖపట్నం జిల్లా:
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా అనుసరించాల్సిన నిబంధనలు మరియు అందుబాటులోకి తేనున్న సౌకర్యాలను వీడియో కాన్ఫరెన్స్ వివరించారు 
 
1. అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం:సీఎస్ 
2. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలెవరూ ఆందోళన చెంద వద్దు, అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో ప్రతి రోజూ నిత్యావసరాలు సరఫరా చేస్తాం
3. నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1.00 వరకేఅందుబాటు
4. నిత్యావసరాల కొరత, లాక్ డౌన్ పై ఫిర్యాదులకు 1902 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
5. కరోనా వైద్య సంబంధ ఫిర్యాదులు, విదేశీయుల సమాచారం అందించేందుకు 104 టోల్ ఫ్రీ నెంబర్
6. ప్రతి రోజూ ఇంటి వద్దకే  వెళ్లి చెత్త సేకరించే ఏర్పాట్లు చేశాం - ప్రత్యేక బస్సులు, వాహనాల్లో నిత్యావసరాలను తెప్పిస్తాం :సీఎస్ నీలం సాహ్ని

విశాఖ జిల్లాలో కరోనా నియంత్రణకు కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక చర్యలు:
1. విశాఖలో హైఅలెర్ట్ ప్రకటించిన జిల్లా యంత్రాంగం. జిల్లాలో 20 కమిటీలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్
2. అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు
3. హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు వస్తే కేసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా విశాఖ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు :08912590102 

4. అందుబాటులోకి ప్రభుత్వ కార్యాలయం నంబర్లు (విశాఖ DM & HO ఆఫీస్) : 9949379394, 9666556597 
విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ దృష్టిలోకి వచ్చిన కరోనా బాధితులు
1. కరోనా పాజిటివ్ కేసులు: 3
2. దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య : 1
3. పెండింగ్ లో ఉన్న రిపోర్టులు : 30
4. రావలసిన రిపోర్టులు: 61
5. ఐసోలేషన్ లో ఉన్నవారి సంఖ్య : 30
6. ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల సంఖ్య : 12
 
చిత్తూరుజిల్లా:
*   చిత్తూరు జిల్లాలో లాక్ డౌన్ కార్యక్రమం సంపూర్ణంగా జరిగింది.
*   గ్రామ స్థాయిలో ప్రజలు ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.
*   జిల్లాలో నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడిపిన 260 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చి దుకాణాలు హోటళ్లు మూతపడడంతో ఆహారం దొరకని 200 మందికి పైగా వ్యక్తులకు పోలీసులు భోజనం సరఫరా చేశారు.
* ఇక్కడ దేశాలనుంచి చిత్తూరు జిల్లాకు వచ్చి ఆచూకీ దొరకని 23 మందికి నోటీసులను పోలీసులు జారీ చేశారు.
* చాలామంది ప్రజలు నిత్యవసర వస్తువులు తీసుకోవడానికి గుంపులు గుంపులుగా వస్తున్నారని సామాజిక దూరం పాటించేందుకు మూడు గంటల పాటు ఉదయం అన్ని హోల్ సేల్ షాప్ లను గురించి వ్యక్తికి వ్యక్తికి మధ్య మూడు మీటర్ల దూరం సరుకుల పంపిణీ ఉండాలని అదేవిధంగా నిర్ణయించిన దుకాణాల నుంచి హోమ్ డెలివరీ కి అనుమతించారు.
* జిల్లాలో క్వారెన్ టైన సెంటర్లను ఏర్పాటు చేశారు.
* మంగళవారం నాడు పాజిటివ్ కేసులు వచ్చిన శ్రీకాళహస్తిలో నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దయచేసి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పాజిటివ్ కేసు రావడంతో చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది.
 
* చిత్తూరుజిల్లాలో నేడు  కరోనా సోకిందన్న  అనుమానంతో 5 మందిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు లోని గంగాన పల్లి ప్రాంతం నుంచి ఇద్దరిని, మదనపల్లిలో ముగ్గురుని కోవిద్- 19 పరీక్షలు నిర్వహించడానికి పంపారు. ఫలితాలు రావాల్సి ఉంది.
 
కరోనా లాక్ డౌన్ అమలు, నిత్యావసర సరుకుల పంపిణీ పై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ సూపరింటెండెంట్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డి.జి.పి. గౌతం సవాంగ్  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. 
 
వైఎస్సార్ కడప:
* దేశవ్యాప్త "లాక్ డౌన్" కొనసాగింపులో భాగంగా 4వ రోజు బుధవారం జనతా కర్ఫ్యూ పకడ్బందీగా సాగుతోంది. ఉగాది పండుగ వాతావరణం ఎక్కడా కన్పించలేదు. ఆలయాల దర్శనంకు కూడా వెళ్లకుండా ప్రజలు ఇళ్లలోనే పండుగ చేసుకున్నారు. 
 
* మధ్యాహ్నం రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ తో కలసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సహాని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్లో కడప కలెక్టరేట్ విసి హాలు నుండి జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బు రాజన్, జేసీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. 
 
* "లాక