శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:45 IST)

ఉదయం 11 గంటల వరకే వ్యాపారం : కలెక్టర్ ఆదేశం

ఏపీలో పెరిగిపోతున్న కరోనా తీవ్రత దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు తాడేపల్లి, ఉండవల్లి సెంటర్ తో పాటు పరిసర ప్రాంతాల వ్యాపార సముదాయాలు అన్ని  ఉదయం 6:00 నుండి 11:00 గంటల వరకే అనుమతించారు. అయితే టీ, టిఫిన్ దుకాణాలను పూర్తిగా నిషేధించడం జరిగింది. 
 
హోమ్ డెలివరీ ఇచ్చే హోటల్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాకాకుండా హోటల్‌లోనే టిఫిన్ చేస్తూ కనిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 11 గంటల తర్వాత వ్యాపారస్తులు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగాని వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే వారి వ్యాపార లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఉదయం 11 గంటల తర్వాత అనుమతులు ఉండేవి మెడికల్, హాస్పిటల్, పాలు, వాటర్ ప్లాంట్, శానిటైజేషన్ చేసిన సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భోజనం హోటళ్లకు అనుమతి ఉందని డిప్యూటీ కమిషనర్  సీహెచ్ రవిచంద్రారెడ్డి తెలిపారు.