శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chakri
Last Updated : బుధవారం, 19 జులై 2017 (11:48 IST)

చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి... ఏం చేసిందో తెలుసా?

బోయింగ్ 777 ప్రపంచంలోనే అతిపెద్ద ట్విన్‌జెట్ (అంటే రెండు ఇంజిన్లతో నడిచేది). మరే ఇతర విమానానికి లేని విధంగా అతిపెద్ద వ్యాసంతో తయారుచేసిన టర్బోఫ్యాన్ ఇంజిన్లు, ల్యాండింగ్ గేర్‌పై ఆరు చక్రాలు ఉండటం దీని

బోయింగ్ 777 ప్రపంచంలోనే అతిపెద్ద ట్విన్‌జెట్ (అంటే రెండు ఇంజిన్లతో నడిచేది). మరే ఇతర విమానానికి లేని విధంగా అతిపెద్ద వ్యాసంతో తయారుచేసిన టర్బోఫ్యాన్ ఇంజిన్లు, ల్యాండింగ్ గేర్‌పై ఆరు చక్రాలు ఉండటం దీని విశిష్టత.
 
ఇలాంటి విశిష్టత కలిగిన బోయింగ్ 777 విమానానికి విజయవాడకు చెందిన అన్నీ దివ్య తొలి యువ మహిళా కమాండర్‌గా చరిత్ర సృష్టించారు. దివ్య తండ్రి సైన్యంలో జవానుగా విధులు నిర్వర్తించారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దివ్య తన ఖర్చుల కోసం పదకొండో తరగతి నుండే ట్యూషన్‌లు చెప్పేది.
 
పైలెట్ అవ్వాలన్న కోరికతో ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ (ఇగ్రువా) నిర్వహించే ప్రవేశ పరీక్షలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ దివ్య ప్రథమ శ్రేణిలో ఎంపికై, అహర్నిశలు శ్రమించి కోర్సు చివరి ఏడాది మొదటి ర్యాంకు సాధించింది. దివ్య తొలిసారిగా ప్రయాణికురాలిగా కాకుండా పైలెట్‌గా విమానం ఎక్కడం విశేషం. 19 ఏళ్లకే విమానాన్ని నడిపిన ఘనతను సొంతం చేసుకుంది.
 
కోర్సు పూర్తికాగానే స్పెయిన్, లండన్‌లో బోయింగ్ విమానాల కెప్టెన్‌గా శిక్షణ తీసుకుని, తాజాగా ఆ విమానాలకు ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలైన మహిళా కెప్టెన్‌గా రికార్డు సృష్టించింది. ఇదేకాకుండా దివ్యలా కూడా పూర్తి చేయడం విశేషం.