గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (10:00 IST)

తిరుమలలో ఘాట్ రోడ్డులో కారు కలకలం.. లోయలోకి దూకేశారు..

Rain in Tirumala
తిరుమలలో ఘాట్ రోడ్డులో ఓ కారు కలకలం సృష్టించింది. కారులో యువకులు పలు చెక్ పోస్టుల వద్ద ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఛేజ్ చేశారు. అలిపిరి భద్రతా వలయంలో కారును ఆపకుండా దూసుకెళ్లారు.
 
దీంతో భద్రతా సిబ్బంది, విజులెన్స్ సిబ్బంది మొబైల్ వాహనంతో వెంటాడారు. దీంతో కారును ఘాట్ రోడ్డులోనే ఆపేశారు. ఆపై యువకులు లోయలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. లోయలోకి దూకిన వారెంతమందో సంఖ్య ఖచ్చితంగా తెలియడం లేదు. 
 
పోలీసులు, విజిలెన్స్ అధికారులు పారిపోయిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘాట్ రోడ్డులో వారు వదిలి వెళ్లిన కారును ఆపి తనిఖీ చేశారు. అనంతరం కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.