సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

దిల్లీ పీఠం కోసం 'కాలనీ'లపై కేంద్రం కన్ను

దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టింది.

దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరిదీప్​ సింగ్​ తెలిపారు. మహారాష్ట్ర, హరియాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిల్లీపై దృష్టి సారించింది. దేశ రాజధానిలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది.

దిల్లీలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. నగరంలోని అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్​.

దీనికి సంబంధించి వచ్చే పార్లమెంట్​ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి హరిదీప్​ సింగ్​ వెల్లడించారు.