1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (16:25 IST)

విజ‌య డైయిరీకి చ‌లసాని ఆంజనేయులే మళ్ళీ చైర్మన్

విజ‌య‌వాడ‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)కి రెండవసారి చైర్మన్ గా ఎన్నిక‌య్యారు. మ‌ళ్ళీ పదవి భాద్యతలు చేపట్టిన చలసాని ఆంజనేయులును విజయవాడలోని అయన ఛాంబర్లో ఆశీనుల‌య్యారు.

సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు, చెరుకు రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండపనేని ఉమా వరప్రసాద్, తెలుగు రైతు రాష్ట్ర నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు కలిసి రైతు పచ్చ కండువా వేసి పూల బొకే అంద‌జేసి, అభినందనలు తెలిపారు. 
 
ఈ ఎన్నిక‌పై విజయవాడలోని సాగు నీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయం నుంచి సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, కృష్ణా మిల్క్ యూనియన్ కు 2019 లో చైర్మన్ గా ఎన్నికైన చలసాని ఆంజనేయులు ఆనతికాలం లోనే పాడి రైతుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశార‌ని అభినందించారు. భారతదేశం లోనే మొట్టమొదటిసారిగా కృష్ణా క్షిర బందు, యాక్సిడెంట్ కేర్, హెల్త్ కార్డులు , సుమంగళి , ప్రతిభ తదితర పన్నెండు రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి కృష్ణా మిల్క్ యూనియన్ ను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిపారు అన్నారు.

సంస్థ టర్నోవర్ ను గత ఐదు సంవత్సరాలలో 600 నుంచి 720 కోట్లకు పెంచడమే కాకుండా, రెండు సంవత్సరాలలో రైతుల పాలసేకరణ ధరను 14 రూపాయలు పెంచటం,సంవత్సరానికి మూడు విడతలుగా పాడి రైతులకు బోనస్ లు ఇచ్చార‌ని తెలిపారు. ప్రస్తుతం 10 శాతం వెన్నకు లీటరుకు డెబ్భై రూపాయలు ఇవ్వటం అభినందనీయం అని కొనియాడారు.

భవిషత్ లో లక్ష యాబై వేల పాడి రైతు కుటుంబాల సంస్థ అయిన కృష్ణా మిల్క్ యూనియన్ ను మరింత అభివృద్ధి చేసి పాడి రైతులకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి తెస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రైతు సంఘాల నాయకులు చెన్నుబోయిన శివయ్య, దయాల రాజేశ్వర రావు, పుట్టా సురేష్ తదితరులు పాల్గొన్నారు.