ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. త్వరలోనే చెలామణిలోకి...

ntr photo
దివంగత నటుడు, మహానేత ఎన్.టి.రామారావు బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెం అందుబాటులోకి రానుంది. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెంను ముద్రించేందుకు భారత రిజర్వు బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిపాదిత నాణెం నమూనాను కూడా ముద్రించారు. దీన్ని ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి ఆర్బీఐ మింట్ అధికారులు చూపించారు. ఈ నాణెం నమూనాపై ఆమె నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ నమూనాకు కూడా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో కూడా వంద రూపాయల నాణె చెలామణిలోకి వచ్చే అవకాశం ఉంది.
 
మరోవైపు, ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం నిర్వహిస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలు, బలహీన వర్గాలకు సాయపడాలన్న ఉద్దేశ్యంతో ఏర్పడిన ఈ ట్రస్ట్‌కు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ, మాహానాయుడు ఎన్టీఆర్ ఆశయాలు, ఆచరణ రూపం ఎన్టీఆర్ ట్రస్టుగా అభివర్ణించారు. విపత్తుల వేళ బాధితులను ఆదుకోవడంలోనూ విద్య వైద్య విజ్ఞాన ఉపాధి రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమన్నారు.