శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (18:43 IST)

ప్రజల ప్రాణాలంటే వైసిపికి లెక్కలేదు: చంద్రబాబు

టిడిపి సీనియర్ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ ప్రజల ప్రాణాలంటే వైసిపికి లెక్కలేకుండా పోయింది..ప్రజల ఆరోగ్యం అంటే లెక్కలేదు, పేదల ఉపాధిపై లెక్కలేదు, ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. 

రాష్ట్రంలో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేదు, మాట్లాడే హక్కు లేదు. ఉన్మాదుల భజన చేయకపోతే ఉసురు తీస్తున్నారు. వైసిపి పాలనలో ప్రాథమిక హక్కులనే కాదు, జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారు. ఏడాదిన్నరలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశారు వైసిపి నాయకులు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనది. అభివృద్ది చేయాల్సిన బాధ్యత అధికార పార్టీదైతే, అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. అలాంటిది ప్రతిపక్షాన్ని అణిచేయాలని పోలీసులు చూడరాదు. ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ప్రయత్నించ కూడదు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనది. అభివృద్ది చేయాల్సిన బాధ్యత అధికార పార్టీదైతే, అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. అలాంటిది ప్రతిపక్షాన్ని అణిచేయాలని పోలీసులు చూడరాదు. ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ప్రయత్నించ కూడదు. 

పోలీసులపై ఇన్ని అభియోగాలు, ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు నా జీవితంలో వినలేదు, చూడలేదు. పార్టీలకు అతీతంగా బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ కొందరికే కొమ్ము కాస్తోందనే భావన ప్రజల్లో పెరగడం దుష్పరిణామం. ఇప్పటికైనా తప్పులు దిద్దుకోవాలి, అరాచక శక్తుల ఆగడాలకు కళ్లెం వేయాలి, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలి. 

సిగ్గుఎగ్గు లేకుండా వైసిపి వ్యవహరిస్తోంది. ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పదేపదే అబద్దాలు చెప్పి వాటినే నిజాలుగా ప్రజల్లో అపోహలు సృష్టించాలని వైసిపి నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు.  

రాష్ట్రంలో దళితులపై వైసిపి హింసాకాండ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నలుగురు దళిత యువకులను కొట్టుకుంటూ లాక్కెళ్లడం, 36గంటల అక్రమ నిర్బంధం అతి దారుణం. 

ప్రతి దళితుడికి టిడిపి అండగా ఉండాలి. దళితులపై వైసిపి అరాచకాలను అడ్డుకోవాలి. ఏ దళిత కుటుంబానికి ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకోవాలి. పేదల భూములకు, ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు హాని కలిగిస్తే సహించేది లేదు. 
హిందూ ధార్మిక సంస్థలపై, దేవాలయాలపై అరాచకశక్తుల దాడులను అందరూ గర్హించాలి.

ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. టిడిపి మత సామరస్యానికి కట్టుబడిన పార్టీ. ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసినా ఉపేక్షించేది లేదు. 

టిటిడి, మాన్సాస్, రాజమహేంద్రవరం వైశ్య సత్రం, వెంకోజీపాలెం జ్ఞానానంద ఆశ్రమం...అన్నింటిలో వైసిపి నాయకులు లుకలుకలు తెస్తున్నారు.  ఎండో మెంట్ భూముల కబ్జాలు, ట్రస్ట్ బోర్డులలో రాజకీయ జోక్యాలు పెరిగిపోయాయి. 
రథాలకు నిప్పు, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం, దేవాలయాలు కూల్చేయడం దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి. అంతర్వేది సహా అన్ని దేవాలయాల్లో జరిగిన దాడులపై సిబిఐ విచారణ జరపాలి.

వైసిపి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలపై దాడులు పెరగడం గర్హనీయం. గుంటూరు జిల్లా వినుకొండ, తెనాలి, నెల్లూరు జిల్లా కావలి, అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం తదితర ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించడం, ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. 

డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ప్రథమ వర్థంతి బుధవారం అన్ని జిల్లాలలోనిర్వహించాలి. వైసిపి ప్రభుత్వ దుర్మార్గాలకు కోడెల శివ ప్రసాద్ బలి అయ్యారు. తప్పుడు ఆరోపణలతో కోడెల కుటుంబ సభ్యులపై 23కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి ఆయన ఉసురు తీశారు. వైసిపి గవర్నమెంట్ టెర్రరిజానికి బలైన తొలి వ్యక్తి డాక్టర్ కోడెల. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కోడెల వర్థంతి జరపాలి, వైసిపి ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టాలి.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే తెలుగుదేశంపార్టీపై వైసిపి బురద జల్లుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకే అమరావతి భూములపై దుష్ప్రచారం చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటి వేశారు, సిట్ వేశారు, సిబిఐకి ఇచ్చారు, రాజకీయ కక్షతోనే టిడిపి నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారు. అభివృద్ది పనులను ఆపేసి, అరాచకాలను ప్రోత్సహించడమే పనిగా వైసిపి ప్రభుత్వం పెట్టుకుంది.

తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల వల్లే రాయలసీమకు నీళ్లిచ్చాం, చెరువులు నింపి పంటలు ఎండిపోకుండా కాపాడాం. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలు 120టిఎంసిలను సద్వినియోగం చేశాం. నదుల అనుసందానం చేశాం, వ్యవసాయం అనుబంధ రంగాల్లో సత్ఫలితాలు సాధించాం. నీటిపారుదల ప్రాజెక్టులపై రూ65వేల కోట్లు ఖర్చు చేశాం, 23ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం, మరో 40ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశాం. ఏడాదికి టిడిపి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంపై రూ 15వేల కోట్ల పైన ఖర్చుచేస్తే అందులో మూడోవంతు కూడా వైసిపి ప్రభుత్వం ఖర్చు పెట్టకపోవడం శోచనీయం. 

ఏడాదిన్నరలో వేల కోట్ల భారాలు ప్రజలపై మోపారు.  సిఎన్ జిపై 10% పన్ను పెంచి ఆటో డ్రైవర్లపై భారం మోపారు. ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు. ఆటో డ్రైవర్లకు రూ 10వేలు ఇచ్చి, రూ 20వేలు లాక్కోవడం హేయం. కరెంటు బిల్లులు, ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటాయి. దళారుల ఇష్టారాజ్యంగా మారింది.

దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు కలిగే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ. ఇదే చివరి అవకాశం తమ దోపిడీకి అన్న ఆరాటంతో వైసిపి బరితెగించింది. విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు చేస్తున్నారు. దాడులు దౌర్జన్యాలతో పేదలను బెదిరిస్తున్నారు. 

వైసిపి అవినీతి, అక్రమాలను, అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలి. ప్రజల్లో చైతన్యం పెంచాలి. ప్రజలే వైసిపి నాయకులను నిలదీసేలా చేయాలి. 

ప్రజల సహనానికి హద్దులు దాటిపోయాయి. వైసిపి దుర్మార్గాలపై ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చింది. అంతర్వేదికి వచ్చిన మంత్రులను భక్తులే ఘెరావ్ చేశారు. వరద ప్రాంతాల్లో మంత్రులను బాధితులే నిలదీశారు. ఈ చైతన్యం రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో నెలకొనాలి. ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైనే ఉందని’’ టిడిపి సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు పేర్కొన్నారు.